అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలుస్తున్నాయి. సోయాబీన్, మొక్కజొన్న రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.డోనాల్డ్ ట్రంప్ పాలనలో సుంకాల ప్రభావం, వాణిజ్య యుద్ధం రెండు పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. చైనా అమెరికా సోయాబీన్ కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల అమెరికా రైతులు దశాబ్దాలలో అత్యంత సంక్లిష్టమైన మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
సాపేక్షంగా గత సంవత్సరం US సుమారు 24.5 బిలియన్ డాలర్ల విలువైన సోయాబీన్ ఎగుమతులు చేసింది. అయితే అందులో చైనా 12.5 డాలర్ల బిలియన్ల విలువై ఉత్పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఈ సంవత్సరం చైనా ఆ కొనుగోళ్లను ఆపేయడంతో అమెరికన్ రైతులు తమ పంటను అమ్మే మార్గం లేకపోయింది. దీని కారణంగా వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మే నెలలో.. Trump ప్రభుత్వంలోని భారీ సుంకాలు చైనా దిగుమతులపై విధించబడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా చైనా.. అమెరికన్ సోయాబీన్, మొక్కజొన్న పై 34 శాతం సుంకాన్ని విధించి కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా ప్రతీకారం తీర్చింది. అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్ చీఫ్ కాలేబ్ రాగ్లాండ్ మాట్లాడుతూ.. ఇది పరిశ్రమకు ఒక పెద్ద హెచ్చరిక అని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా రైతులకు నష్టాలు, పంట నిల్వ సమస్యలు, మార్కెట్ లభ్యత పరిమితులతో పాటు, అమెరికా లో రాజకీయ ఉద్రిక్తతలను కూడా పెంచింది.
అక్కడ రైతుల ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికన్ సోయాబీన్ ఎగుమతి మండలి CEO జిమ్ సుట్టర్ మాట్లాడుతూ.. మే, సెప్టెంబర్ మధ్య నాలుగు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి ఒప్పందం కుదరలేదు. సమయం ముగిసిపోతోందని నేను ఆందోళన చెందుతున్నాను. ట్రంప్, అవసరమైతే తాత్కాలిక ఉపశమన ప్యాకేజీని పరిశీలిస్తున్నారని ప్రకటించినప్పటికీ, రైతులు దీన్ని పూర్తిగా పరిష్కారం అనుకోవడం లేదు.ఇప్పటి పరిస్థితి చైనా వ్యూహంపై ఆధారపడింది కాబట్టి అమెరికా మొదటి అడుగు వేయాలని తెలిపారు.
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హీ యాడోంగ్ ప్రకారం.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడానికి అమెరికా అన్యాయమైన సుంకాలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి ఉత్పత్తులు, సముద్ర ఆహార ఎగుమతులు చైనా ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నిపుణుల ప్రకారం.. భారతదేశం, చైనా తమ స్థిరమైన వాణిజ్య విధానాలను కొనసాగిస్తే, అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు ఉండరు. ఈ పరిస్థితి కొనసాగితే, ట్రంప్ కూడా నిర్ణయాలను మళ్ళీ పునర్విచారించవలసి వస్తుందని సూచిస్తున్నారు.
ఇక అమెరికా సెనేట్‌లో కూడా రైతుల సమస్యలు వేడెక్కాయి. సౌత్ డకోటా రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సంక్షోభం ప్రధాన చర్చ అంశంగా నిలిచిందని NBC మీట్ ది ప్రెస్‌లో సెనేట్ నాయకుడు జాన్ థూన్ పేర్కొన్నారు. చైనా 34 శాతం సుంకాన్ని అమలు చేసి.. అమెరికన్ సోయాబీన్ కొనుగోళ్లను ఆపడం వల్ల రైతులు అధిక పంట నిల్వ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
భారతదేశం కూడా యుఎస్ కు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా గుర్తించబడింది. అయితే విభిన్న వ్యూహాలతో స్థిరంగా ఉండటం ట్రంప్ ప్రయత్నాలను విఫలపరిచింది. భారతదేశంలో సోయాబీన్, మొక్కజొన్నపై సుంకాలు అధికంగా ఉంటాయి. (మొక్కజొన్న 45%, సోయాబీన్ 60%). అలాగే కొన్ని అమెరికన్ సోయాబీన్ రకాల దిగుమతిని నిషేధించింది. సోయా నూనె, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కోసం భారత్ ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్ వంటి దేశాలపై ఆధారపడుతుంది.
ఏదేమైనా పరిమితమైన ప్రపంచ మార్కెట్ ఎంపికలు కారణంగా అమెరికన్ రైతులు తమ పంటలను నిల్వ చేయడానికి లేదా భారీ నష్టాలు భరించవలసి వస్తోంది. ప్రభుత్వ సహాయం, ప్యాకేజీలపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి అవి తగినంత ప్రభావవంతంగా ఉండవని తెలుస్తోంది. ట్రంప్ సుంకాల దాడి అమెరికన్ వ్యవసాయానికి తీవ్రమైన ఎదురుదెబ్బగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల సామరస్యాన్ని కూడా హైలైట్ చేస్తూ.. అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇప్పుడు తాము ఎదుర్కొంటున్న తీరుపై ప్రభావాన్ని చూపుతుంది.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications