ధ్వంసం.. మూడేళ్ల కిందే ఆ పని చేసి ఉండేవాళ్లం: జియోకు ఎయిర్‌టెల్ బిగ్ ఝలక్
కొత్తచట్టాల నేపథ్యంలో ఉత్తరాదిన పలుచోట్ల ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పలుచోట్ల ఆందోళనకారులు టవర్లు ధ్వంసం చేశారు. ప్రధానంగా జియో టవర్లు ధ్వంసమయ్యాయి. దీంతో రైతు ఆందోళనలో భాగంగా తమ టవర్లను ధ్వంసం చేయడంలో ప్రత్యర్థి సంస్థలు ఉన్నట్లు రిలయన్స్ జియో ఆరోపించింది. ఈ ఆరోపణలపై ప్రధాన పోటీదారు అయిన ఎయిర్‌టెల్ స్పందించింది. రిలయన్స్ జియో ఆరోపణలను కొట్టి పారేసింది.

ఆధారాలు ఉన్నాయా
రిలయన్స్ జియో చేసిన ఆరోపణలు నిరాధారమని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. జియో ఆరోపణలకు ఆధారాలున్నాయా అని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌కు రాసిన లేఖలో ఎయిర్‌టెల్ పేర్కొంది. డిసెంబర్ 28వ తేదీన జియో చేసిన ఫిర్యాదుపై శనివారం ఎయిర్‌టెల్ స్పందించింది. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో జియోకు చెందిన టవర్లపై దాడులు జరిగాయని,. రైతుల ఆందోళన వెనుక ప్రత్యర్థులు ఉన్నారని జియో ఆరోపించడం సబబుకాదని ఎయిర్‌టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ తెలిపారు. వోడాఫోన్ ఐడియా కూడా ఈ ఆరోపణలను ఖండించింది.

ఆ పని చేయాలనుకుంటే అప్పుడే చేసేవాళ్ళం
గతంలో కూడా జియో తమ పైన ఫిర్యాదు చేసిందని ఎయిర్ టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ తన లేఖలో పేర్కొన్నారు. రైతుల ఆందోళన వెనుక ఎయిర్‌టెల్ ఉందని జియో ఆరోపించడం సరికాదని తెలిపింది. ఒకవేళ అదే పవర్ తమకు ఉంటే మూడేళ్ల క్రితమే ఆ పని చేసి ఉండేవాళ్లమని తెలిపారు. అలా జరిగి ఉంటే జియోలో అంతమంది సబ్‌స్క్రైబర్లు చేరి ఉండేవారు కాదని అభిప్రాయపడింది. పాతికేళ్లుగా టెలికం రంగంలో కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తూ మార్కెట్లో నిలదొక్కుకున్నట్లు తెలిపింది. అలాగే టెలికం సేవలకు అంతరాయం కలిగించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది.

వొడాఫోన్ ఐడియా ఖండన
తప్పుడు ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. వొడాఫోన్ ఐడియా అలాంటి పనులు ఎప్పటికీ చేయదని తెలిపారు. తమ సంస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఆరోపణలు కనిపిస్తున్నాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications