Byju's: దేశంలో అతిపెద్ద ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఒకపక్క అప్పుల కుప్పలు పెరిగిపోతోంటే మరోపక్క ఫండింగ్ ఇబ్బందులు కంపెనీని చుట్టుముట్టాయి.
ఇదే క్రమంలో కంపెనీ ఇటీవల అమెరికా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయటం నిలిపివేసింది. ఈ వివాదం కాస్త యూఎస్ కోర్టుదాకా వెళ్లింది. ఇదే సమయంలో ఐటీ అధికారులు బెంగళూరులోని కార్యాలయాల్లో సోదాలు కూడా చేపట్టారు. కానీ.. ఇప్పుడు కంపెనీని రాజీనామాలు చుట్టుముట్టాయి. కీలక బాధ్యతలు చేపడుతున్న ప్రతినిధులు కంపెనీని వీడుతున్నారు.

ఎడ్టెక్ మేజర్ బైజు బోర్డులోని ముగ్గురు సభ్యులతో పాటు కంపెనీ అధికారిక ఆడిటర్ డెలాయిట్ రాజీనామా చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. రస్సెల్ డ్రేసెన్‌స్టాక్, వివియన్ వు, జీవీ రవిశంకర్ వైదొలిగినట్లు తెలుస్తోంది. రాజీనామాలను బోర్డు సభ్యులు ఇంకా ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే బోర్డు సభ్యులు రాజీనామా చేయడాన్ని బైజూ ఒక ప్రకటనలో ఖండించింది.

బైజూస్ ఆడిటర్ గా ఉన్న డెలాయిట్ మార్చి 2021, మార్చి 2022తో ముగిసిన కాలానికి సంబంధించిన ఆడిట్ నివేదికలను ఫైనలైజ్ చేయడంలో అసమర్థత కారణంగా రాజీనామా చేసింది. దీంతో కంపెనీ BDO (MSKA & Associates)ని నియమించుకుంది. FY21లో బైజూస్ రూ.4,564 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయాలు 3.3% తగ్గి రూ.2,428 కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications