Gold News: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటుండగా.. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం అయోమయంలో ఉన్నారు. అసలు ఈ గందరగోళం ఏంటి..? ఏం జరుగుతోంది..?
2023 మెుదటి రెండు నెలలు సున్నా రాబడులను అందించిన స్టాక్ మార్కెట్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్ ఆ తర్వాత పుంజుకున్నాయి. ఆ తర్వాతి నాలుగు నెలలు బలమైన రాబడులతో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో సేఫ్ హెవెన్ బంగారం, సెన్సెక్స్-నిఫ్టీలకు మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. సెన్సెక్స్ 6.32 శాతం, నిఫ్టీ 5.83 శాతం రాబడిని అందించగా బంగారం మాత్రం 5.73 శాతం రిటర్న్ అందించింది. ప్రధానంగా అమెరికా ఆర్థికం రికవరీ, ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గుదల, రుతుపవనాలు, తగ్గుతున్న చమురు ధరలు ఇందుకు దోహదపడ్డాయి.

ఆర్థిక మందగమనం ఆందోళనల కారణంగా మొదటి రెండు నెలల్లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ ఆశించిన ఫలితాలను అందించటంలో విఫమయ్యాయని IFL సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా తెలిపారు. ఆ కాలంలో గోల్డ్ సేఫ్ పెట్టుబడిగా మారింది. అప్పట్లో ఈక్విటీలు, బాండ్స్ వంటి పెట్టుబడి సాధనాల నుంచి డబ్బును ఇన్వెస్టర్లు పసిడిలోకి మార్చటం జరిగింది. ఆ తర్వాత మే నెల మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ బంగారంలో ప్రారంభమైంది. దీనికి తోడు బలమైన డాలర్ కారణంగా గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి.
ఏప్రిల్ నెలలో నిఫ్టీ-సెన్సెక్స్‌లలో పెద్ద మార్పు జరిగింది. దేశీయ ఇన్వెస్టర్లతో పాటు, విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు దిగటంతో సూచీలు లాభపడ్డాయి. ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఆ తర్వాత నిఫ్టీ-సెన్సెక్స్ సూచీలు తమ ర్యాలీని మే, జూన్‌లలో కూడా కొనసాగించటంతో సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ తాజాగా 65 వేల మార్కునను కూడా దాటింది.
సెన్సెక్స్-నిఫ్టీలు జీవిత గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నప్పటికీ బంగారం కూడా బలంగానే ఉంది. బంగారం ధరలు ఏడాది ప్రాతిపదికన దాదాపు 5.73 శాతం పెరిగాయి. యూఎస్ ఫెడ్ ఈ ఏడాది చివర్లో వడ్డీ రేటును తగ్గించే ఆశల మధ్య బంగారం ధరలు బుల్లిష్‌గా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా పసిడి ధర కళ తప్పుతోంది. రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, పండుగల డిమాండ్ వంటి కారణాలతో మళ్లీ ఊపందుకుంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఏడాది సెకండాఫ్‌లో గోల్డ్, సెన్సెక్స్-నిఫ్టీ రేసు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications