Adani-TotalEnergy: బంగారు బాతు గుడ్డు లాంటి ప్రాజెక్ట్ హైడ్రోజన్ ఇంధన తయారీ. ఎందుకంటే ఇది భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయం కావటమే. పైగా గ్రీన్ ఎనర్జీని వినియోగించటం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం ముందువరుసలో ఉందని ఇటీవలి బడ్జెట్ కేటాయింపులు సైతం చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో దేశంలోని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ నాలుగు అడుగులు ముందే ఉందని చెప్పుకోవాలి.

ఫ్రాన్స్ సంస్థ..
ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ కంపెనీ అదానీ గ్రూప్ తో కలిసి హైడ్రోన్ వ్యాపారంలో ముందుకెళ్లేందుకు జతకట్టినున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకంపనల తర్వాత ఈ డీల్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పార్ట్నర్ షిప్ విషయంలో ముందుకు వెళ్లటాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తాజాగా ప్రకటించింది. దీంతో అదానీ ఆశలపై నీలిమేఘాలు అలుముకున్నాయి.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏమన్నారంటే..
దిగ్గజ ఫ్రెంచ్ ఆయిల్ కంపెనీ టోటల్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్రిక్ పౌయాన్నే దీనిపై ప్రకటన చేశారు. విలేకరుల ప్రకటనలో అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ఆడిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఆడిట్ కు సంబంధించిన ఫలితాలు ఇంకా తమకు అందలేదని వాటి కోసం వేచి ఉన్నట్లు స్పష్టం చేశారు. అదానీతో కొత్త హైడ్రోజన్ వెంచర్ గురించి ప్రస్తుతానికి ప్రకటన మాత్రమే జరగిందని.. దీనికి సంబంధించి ఎలాంటి డీల్ సంతకాలు జరగలేదని పౌయాన్నే తెలిపారు. ఆడిట్ ముందుకు సాగుతున్నప్పుడు విషయాలను పాజ్ చేయడం మంచిదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత పెట్టుబడులు..
అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీల్లో ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీకి వాటాలు ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రీన్ ఇప్పటికీ మనం పెట్టుబడి పెట్టిన దానికంటే రెండింతలు విలువైనది, అదానీ గ్యాస్ ఇంకా ఎనిమిది రెట్లు ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం వారి అకౌంట్స్ ఆరోగ్యకరంగానే ఉన్నాయని తెలిపారు.

వారం కిందట..
టోటల్ ఎనర్జీస్ ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పైగా దేశంలోని నాలుగు జాయింట్ వెంచర్లలో అదానీ గ్రూప్‌కు భాగస్వామిగా ఉంది. అయితే అదానీ గ్రూప్ కంపెనీల్లో అకౌంటింగ్ మోసాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలతో.. ఆడిటర్లలో ఒకరిని జనరల్ ఆడిట్ కోసం నియమించుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని టోటల్ ఎనర్జీ స్వాగతించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications