Adani News: అదానీ గ్రూపుకు మద్ధతుగా పాతమిత్రుడు.. భారీ ఇన్వెస్ట్‌మెంట్‌కు చర్చలు షురూ!

Adani News: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అదానీ గ్రూప్.. పెట్టుబడులు ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీటిలో చాలా వరకు సక్సెస్ కాగా మరిన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వైపు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ్రెంచ్ చమురు దిగ్గజ సంస్థ టోటల్ ఎనర్జీస్ SE.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై ఉత్సాహం చూపిస్తున్నారని బ్లూమ్‌ బర్గ్ నివేదించింది. ఈ మేరకు అదానీ గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇవి కనుక సఫలం అయితే హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూపులో టోటల్ సంస్థ పెడుతున్న మొదటి ఇన్వెస్ట్ మెంట్ ఇదే అవుతుంది.

Total Energies in talks to invest $700 Mn in Adani Renewable Energies

బ్లూమ్‌ బర్గ్ నివేదిక ప్రకారం.. హిండెన్ బర్గ్ రీసెర్ట్ రిపోర్ట్ అనంతరం హోల్డ్ లో పెట్టిన 5 బిలియన్ డాలర్ల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును టోటల్ గ్రూప్ ఇప్పుడు పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తోంది. ఇంధన విభాగంలో 2018 నుంచి అదానీతో పార్టనర్‌ షిప్ కలిగి ఉన్న ఈ ఫ్రెంచ్ గ్రూప్.. మరో 700 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి ఈ బంధాన్ని మరింత పట్టిష్ఠపరుచుకోవాలని చూస్తోంది.

ఇప్పటికే అదానీ కుటుంబంతో సహా ప్రమోటర్ సంస్థలు టోటల్ గ్యాస్ లో 37.40% వాటా కలిగి ఉండగా.. టోటల్ ఎనర్జీస్ కూడా అదే స్థాయిలో షేర్ హోల్డ్ చేస్తోంది. అదానీకి చెందిన పునరుత్పాదక ఇంధన విభాగంలో వాటాను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని 2021లోనే టోటల్ గ్రూపు ప్రకటించింది. కాగా భారత ప్రభుత్వం నుంచి కూడా ఈ రంగానికి ఇప్పుడు మద్ధతు లభిస్తుండటంతో.. టోటల్ గ్రూపు మళ్లీ యాక్టివ్ అయినట్లు మార్కెట్ నిపుణుల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+