అదానీ వ్యవహారం ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తోంది. ఈ విషయంపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఏమాత్రం వినిపించుకోవడం లేదు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉందని RBI సైతం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఇచ్చే రుణాలను CRILC ద్వారా నిరంతరం గమనిస్తున్నామని తెలిపింది. ఈ గందరగోళానికి కారణమైన రుణాల పరిస్థితి మన దేశంలో ఎలా ఉందో చూద్దాం..

ప్రభుత్వ బ్యాంకులదే సింహభాగం:
దేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఇచ్చిన టాప్ 10 రుణాలు మొత్తం కలిపితే.. దాదాపు 12 లక్షల 72 వేల కోట్లు అని లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ లిఖితపూర్వకంగా ప్రకటించింది. ఇందులో సింహభాగం 8 లక్షల 11 వేల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులది కాగా.. మిగిలిన 3 లక్షల 71 వేల కోట్లు ప్రైవేటు రంగ బ్యాంకుల కిందకు వస్తుంది. ఈ సమాచారం మొత్తం సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్(CRILC) డేటాబేస్‌లో నివేదించినట్లు పేర్కొంది.

మూలధనంలో 25 శాతం మాత్రమే:
బ్యాంకింగ్ రంగాన్ని రిస్క్ నుంచి కాపాడటానికి రిజర్వ్ బ్యాంకు CRILC విధానాన్ని అమలు చేస్తోంది. ఇష్టం వచ్చినట్లు వివిధ కంపెనీలకు రుణాలు ఇచ్చి తర్వాత ఇబ్బందులు పడకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రేమ్ వర్క్ ను అనుసరిస్తోంది. దాని ప్రకారం ఏదైనా బ్యాంకు తన ఎలిజిబుల్ మూలధనంలో, గరిష్టంగా 25 శాతం వరకు మాత్రమే ఒకే గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీలకు రుణంగా ఇవ్వవచ్చు. ఈ తరహా అప్పులను ఆయా బ్యాంకులు తప్పనిసరిగా RBI కి నివేదించాలి.

ముందే గుర్తించవచ్చు:
ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కోసం డెట్-ఈక్విటీ నిష్పత్తికి సంబంధించి బ్యాంకులకు ఓ స్పష్టమైన విధానం తప్పనిసరిగా కలిగి ఉండాలని RBI మార్గదర్శకాలు చెబుతున్నాయి. పెద్ద రుణగ్రహీతలు డీఫాల్ట్ అయినా లేదా చెల్లింపుల్లో ఆలస్యం జరిగినా.. ఆర్థిక సంస్థలను రక్షించడానికి కేంద్ర బ్యాంకు పలు చర్యలు తీసుకుందని మంత్రిత్వ శాఖ తన సమాధానంలో పేర్కొంది. దివాలా, డీఫాల్ట్ కానున్న ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు, ప్రత్యేకమైన సమగ్ర విధానం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications