Power Stock: ఈ పవర్ స్టాక్ వెంటపడుతున్న ఇన్వెస్టర్లు.. ఏడాదిగా స్టాక్ పరుగులు..
Torrent Power Stock: ఎనర్జీ రంగంలోని షేర్లపై చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి తోడుగా గృహ వినియోగం పెరగటం, ఈవీ వాహనాలవైపు ప్రభుత్వం ప్రజలను మళ్లించే ప్రయత్నం వంటి కారణాలు విద్యుత్ డిమాండ్ పెంచుతోంది. దీనికి తోడు ఇతర కారణాలతో ఈ రంగంలోని స్టాక్స్ సూపర్ లాభాలను చూస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టోరెంట్ పవర్ కంపెనీ షేర్ల గురించే. టొరెంట్ గ్రూప్ కంపెనీ ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలానికి బలమైన లాభాలు ప్రకటించటంతో పవర్ షేర్లలో తుఫాను పెరుగుదల నమోదైంది. ఫలితాలతో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో ఏకంగా 18 శాతం లాభపడ్డాయి. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ.1,899 స్థాయికి చేరి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి.

జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ రూ.996.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది ప్రాతిపదికన తొలి త్రైమాసికంలో నికర లాభం 87.2% పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం 23.3% పెరిగి రూ.9,033.7 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. నిర్వహణ స్థాయిలో టొరెంట్ పవర్ EBITDA సుమారు 57% పెరిగి రూ.1,857.9 కోట్లకు చేరుకుంది. EBITDA మార్జిన్ గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 16.2% నుంచి 20.6%కి మెరుగుపడింది. అలాగే టొరెంట్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100% ఈక్విటీ షేర్లను టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.85 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆఫ్ టోరెంట్ పవర్ ఆమోదించింది.
గడచిన ఏడాది కాలంలో టొరెంట్ పవర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 180 శాతం రాబడిని అందించింది. జూలై 31, 2023న కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.676.50 ధర వద్ద ఉండగా.. నేడు తరికొత్త గరిష్ఠమైన రూ.1,899కి చేరుకున్నాయి. అలాగే 2024లో టొరెంట్ పవర్ షేర్లు 103% రాబడిని అందించింది. అలాగే గత 6 నెలల కాలంలో టోరెంట్ పవర్ షేర్లు 83% పెరిగాయి.


Click it and Unblock the Notifications