Women's day: ఆడపిల్లకు చదువు ఎందుకులే అని గతంలో చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు పురుషులకు తామేమీ తక్కువ కాదు ఇంకొంచెం ఎక్కువేనని మహిళామణులు నిరూపిస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలోని టాప్ విశ్వవిద్యాలయాలు వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి అంటే వారి మార్క్ పాలన ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనుండగా.. వివిధ దేశీయ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లో వారి హవా ఎలా నడుస్తుందో చూద్దాం..

టాప్ నాలుగింటిలో మొదటిసారిగా..
సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో అధికార స్థానాలను పురుషులే నిర్వహిస్తుంటారు. అయితే నిర్ణయం తీసుకునే స్థానాల్లో ఎక్కువగా మహిళలే ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ప్రముఖ 5 విశ్వవిద్యాలయాల్లో నాలుగింటికి వారే నాయకత్వం వహించనున్నారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క గ్లోబల్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2023 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల(MIT)లు.. మొదటిసారి మహిళల నేతృత్వంలో కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.

అగ్రి విశ్వవిద్యాలయాల్లో ఇలా..
ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ ను ప్రస్తుతం ఐరీన్ ట్రేసీ నడిపిస్తున్నారు. రెండో స్థానంలోని హార్వర్డులో క్లాడిన్ గే, మూడవదిగా నిలిచిన కేంబ్రిడ్జిలో డెబోరా ప్రెంటిస్ ఈ జూలైలో నాయకత్వ స్థానాల్లో నియామకం కానున్నారు. MIT ప్రస్తుతం సాలీ కార్న్‌బ్లుత్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 డేటా ప్రకారం.. 200 విశ్వవిద్యాలయాల్లో 48 మంది మహిళా ప్రెసిడెంట్‌లు లేదా వైస్-ఛాన్సలర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాదిలో 43తో పోలిస్తే ఇప్పుడు కొంత పెరిగింది. క్రితం సంవత్సరంతో పోల్చి చూస్తే.. మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం 12 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం 41 శాతం ఈ రేటు అధికమైనట్లు నివేదిక వెల్లడిస్తోంది.

అమెరికా, యూరప్ లలో భారీగా..
US, జర్మనీల్లో మహిళల నాయకత్వ రేటు ఎక్కువగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలోని మొత్తం 58లో 16ను వారే నిర్వహిస్తున్నారట. 5 అగ్రశ్రేణి జర్మన్ విశ్వవిద్యాలయాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారని డేటా వెల్లడించింది. యూరప్ దేశాల్లోనూ దాదాపు ఇదే విధానం కొనసాగుతోంది. ఫ్రాన్సులోని 5లో 3, నెదర్లాండ్స్ కు చెందిన 10కి 5, 28 UK యూనివర్సిటీల్లో ఎనిమిదింటికి మహిళలలే సారథ్యం వహిస్తున్నారు.

నాంది పలికిన ఆసియా:
ఈ విషయంలో ఆసియా సైతం ముందంజలో ఉంది. హాంకాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్షురాలిగా నియమితులైన న్యూరో సైంటిస్ట్ నాన్సీ ఐప్.. 200 విశ్వవిద్యాలయాల్లో చూస్తే, నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద విశ్వవిద్యాలయం కింగ్ అబ్దులాజీజ్ విశ్వవిద్యాలయానికి హనా అబ్దుల్లా అల్-నుయిమ్ తాత్కాలిక మహిళా నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ 5 ఏళ్ల ట్రెండ్:
2022లో 43 మంది, 2021లో 41, 2020లో 39, 2019 మరియు 2018లో 34 - గ్లోబల్ యూనివర్శిటీల్లో మహిళా బాస్ ల సంఖ్య ఏటేటా స్థిరంగా పెరుగుతోందని డేటా చూపిస్తోంది. కానీ 27 దేశాలకు చెందిన 12 టాప్ విశ్వవిద్యాలయాల్లో వారి నాయకత్వం లేకపోవడం శోచనీయం. ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ సైతం, 200 మంది మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications