మార్కెట్ క్యాప్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో మూడు ప్రధాన ఫండ్లు ఉన్నాయి. అవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్ల కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అయితే స్మాల్ క్యాప్ ఫండ్లు బేరిష్ మార్కెట్ లో చాలా వరకు పడిపోయే ప్రమాదం ఉంది. కానీ స్మాల్ క్యాప్ మ్యూచవల్ ఫండ్లు ధీర్ఘకాలంలో మంచి రాబడి ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్లలో ఎక్కవ రాబడి సాధించిన స్మాల్ క్యాప్ ఫండ్లు ఏంటో చూద్దాం..
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 48.35% రాబడి ఇయ్యగా.. HSBC స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 46%, HDFC స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ 45.42%, కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 44.19%, టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 43.71%, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్- డైరెక్ట్ ప్లాన్ 43.12%, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ కంపెనీస్ ఫండ్ 41.89%, సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్- 40.85%,యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్ 37.95% రాబడి ఇచ్చింది.

స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో జూన్ నెలలో 67 శాతం పెట్టుబడులు పెరిగాయి. మేలో , 3,282.50 కోట్లకు రాగా, జూన్ లో 5,471.75 కోట్ల ఎత్తును తాకినట్లు తాజా AMFI డేటా పేర్కొంది. స్మాల్ క్యాప్ ఫండ్ యూనిట్ల నుంచి మూలధన లాభాలను ఒక సంవత్సరం వరకు హోల్డింగ్ వ్యవధిని స్వల్పకాలిక మూలధన లాభాలు (ఎస్‌టిసిజి)పరిగనిస్తారు. వీటిపై 15%పన్ను విధిస్తారు. హోల్డింగ్ వ్యవధి ఒక సంవత్సరానికి మించి ఉంటే, లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టిసిజి) గా పరిగణిస్తారు. ఈ లాభాలకు 10%పన్ను విధిస్తారు.
Note: పై సమాచారం, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. గుడ్ రిటర్స్ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ధృవీకరించబడిన నిపుణులతో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications