ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బ్యాంకులు ఏడేళ్ల రీపేమెంట్ కాల వ్యవధితో రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ పై 6.75% నుంచి 7.3% శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. మే 4న సెంట్రల్ బ్యాంక్ కీలక పాలసీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటుతో ముడిపడి ఉన్న ఫ్లోటింగ్-రేట్ రిటైల్ రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అంతేకాకుండా.. కొన్ని అంచనాల ప్రకారం ఇవి రానున్న కాలంలో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు బుధవారం ప్రకటించవచ్చని నిపుణులు అంచానా వేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు, ప్రత్యేకించి ఆగస్టు/సెప్టెంబర్‌లో విదేశాలకు వెళ్లాలని కోరుకునే వారికి ఇది అధ్వాన్నమైన సమయంగా చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం.. కొన్ని బ్యాంకులు 7.3 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ అందిస్తున్నాయి.
బ్యాంక్‌బజార్ ప్రకారం కేవలం 6.75 శాతం వడ్డీకే ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంకు దేశంలోనే అత్యంత చౌకైన విద్యా రుణాన్ని అందిస్తోంది. ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ. 20 లక్షల లోన్ కు EMI రూ. 29,942 చెల్లించేందుకు వీలుగా ఎడ్యుకేషన్ లోన్ విద్యార్ఠులు పొందవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 20 లక్షల స్టడీ లోన్ కోసం 6.85 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ఏడేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ రుణానికి చెల్లించాల్సిన EMI రూ. 30,039గా నిర్ణయించింది.
చౌకైన విద్యా రుణాలను అందించే టాప్ టెన్ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగంలోని మూడవదిగా ఇండియన్ బ్యాంక్ నిలిచింది. కేవలం 6.9 శాతం వడ్డీ రేటుకే ఈ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తోంది. ఇందుకు గాను చెల్లించాల్సిన EMI రూ. 30,088గా బ్యాంక్ నిర్ణయించింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేజర్ విద్యా రుణాలపై 7 శాతం వడ్డీ రేటుకు రుణాన్ని అందిస్తుంది. మీరు ఏడు సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 30,185 EMIని చెల్లించాల్సి ఉంటుంది.
ప్రముఖ ప్రభుత్వ రంగ రుణదాతలైన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 7.15 శాతం వడ్డీ రేటుకు విద్యా రుణాలను అందిస్తున్నాయి.ఏడేళ్ల చెల్లింపు వ్యవధితో రూ.20 లక్షల విద్యా రుణాన్ని ఇవి అందజేస్తున్నాయి.
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన SBI విద్యా రుణంపై 7.25 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ. 20 లక్షల రుణంపై, EMI రూ. 30,340 వసూలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఇదే వడ్డీ రేటుకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నాయి.
కేవలం 7.30 శాతం వడ్డీ రేటుకే కెనరా బ్యాంక్ ఉన్నత విద్యకోసం ఎడ్యుకేషన్ లోన్ అందిస్తోంది.రూ. 20 లక్షల లోన్‌పై ఏడేళ్ల రీపేమెంట్ కాల వ్యవధితో చెల్లించాల్సిన ఈఎంఐ రూ.30,480గా బ్యాంక్ నిర్ణయించింది.
జూన్ 4, 2022 నాటికి సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్‌ల నుంచి సేకరించబడిన డేటా ప్రకారం లోన్ వివరాలు అందిచటం జరిగింది. EMI ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ. 20 లక్షల రుణం కోసం టేబుల్‌లో పేర్కొన్న వడ్డీ రేటు ఆధారంగా లెక్కించబడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు సున్నాగా భావించబడ్డాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications