ముంబై: ఇంకో వారం రోజుల్లో ఈ సంవత్సరం ముగిసిపోనుంది, కాలగర్భంలో కలిసిపోనుంది. ఇంకో ఆరు రోజులే మిగిలివున్నాయి. వచ్చే శనివారం నాటికి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి ఉంటాం. 2021లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక రకాల కార్లు తయారయ్యాయి. కొన్ని కంపెనీలు అప్‌డేట్ వర్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటోమొబైల్ సెగ్మెంట్‌లో సహజంగానే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ పోటీని తట్టుకుని వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకున్న కంపెనీలు ఉన్నాయి.
మారుతి సుజుకీ..ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ నేమ్. దేశీయంగా అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసే కంపెనీ ఇది. ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన కనీసం అయిదారు కార్లు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంటుంటాయి. మారుతి సుజుకికి చెందిన వ్యాగనార్.. అగ్రస్థానంలో నిలిచింది. 1.74 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ కారు బేసిక్ ప్రైస్ 4.93 లక్షల రూపాయలు. ఇది ఎక్స్‌షోరూమ్ ప్రైస్. వేగనార్ ఇంజిన్ 1197 సీసీ కెపాసిటీ. సగటున 21 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఆల్టో నిలిచింది. భారత్‌లో ఎక్కువమంది ఇష్టపడే కారు ఇది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ బేసిక్ ప్రైస్ 3.15 లక్షల రూపాయలు. పెట్రోల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వేరియంట్లల్లో లభిస్తుంది. ఈ సంవత్సరం ఆల్టో 1.62 లక్షల యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి తెలిపింది. తక్కువ ధర కావడం వల్ల చిన్న కుటుంబాలు, మధ్యతరగతి ప్రజలు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారని కంపెనీ తెలిపింది.
మారుతి సుజుకికి చెందిన బాలెనో.. ఎక్కువగాసేల్స్ అయిన కార్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ లగ్జరీ కారు బేసిక్ ప్రైస్ 5.99 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్). 1197 సీసీ ఇంజిన్, 88.5 బీహెచ్‌పీతో పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ సంవత్సరం 1.55 లక్షల యూనిట్లు విక్రయం అయ్యాయి. నాలుగో స్థానంలో స్విఫ్ట్ ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా 1.51 లక్షల యూనిట్లు విక్రయం అయ్యాయి. దీని బేసిక్ ధర 5.85 లక్షల రూపాయలు. ఈకో అయిదు స్థానంలో ఉంది. సెవెన్ సీటర్ కెపాసిటీ కారు ఇది. ఈ సంవత్సరం లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ధర 4.38 లక్షల రూపాయలు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications