Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా అస్థిరతలను చూశాయి. అమెరికా, యూరప్ వ్యాప్తంగా అలుముకున్న బ్యాంకింగ్ భయాలు ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో భారత మార్కెట్లు సైతం ఆ ప్రభావాన్ని చవిచూశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సైతం దీనిపై ఎప్పటికప్పడు బ్యాంకులతో సంప్రదింపులు చేస్తూ.. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది.
వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో శ్రీరామ నవమి కారణంగా మార్చి 30న సెలవు. దీనికి తోడు మార్చి 29న వారాంతపు, నెల ముంగిపు F&O సిరీస్ ఎక్స్ పైరీ ఉన్నాయి. కొత్త సిరీస్ కి ముంది ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను సర్థుబాటు చేసుకుంటారు కాబట్టి మార్కెట్లలో అస్థిరత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు ఫిబ్రవరి నెలలో మౌలిక సదుపాయాల అవుట్‌పుట్ డేటా మార్చి 31న విడుదల కానుంది. ఇదే రోజు విడుదల కానున్న ఇండియా బాహ్య రుణాలు, కరెంట్ ఖాతా లోటు, విదేశీ మారక నిల్వలకు సంబంధించిన డేటా కోసం మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.

గుజరాత్‌లో మార్చి 27 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న తదుపరి రౌండ్ G20 సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. దాదాపు 29 దేశాలకు చెందిన 60 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇందులో ప్రత్యేకంగా పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కుప్పకూలటానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ అన్నారు. ఇవి వచ్చే వారం సైతం మార్కెట్లను ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా ఫెడ్ తో పాటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లు మార్చి 27న డల్లాస్ ఫెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్‌తో ప్రారంభించి, గూడ్స్ ట్రేడ్ బ్యాలెన్స్, హోల్‌సేల్ ఇన్వెంటరీస్, CB కన్స్యూమర్ కాన్ఫిడెన్స్‌తో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ నుండి స్థూల-ఆర్థిక నివేదికలను పరిశీలిస్తారు. ఇవి కాక క్రూడ్ ఆయిల్, అమ్ముడు కాని గృహాల వివరాలు, అమెరికా జీడీపీ గ్రోత్ రేట్, వ్యక్తిగత ఆదాయం వంటి డేటాను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకోనున్నాయి.
2023 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-జనవరి మధ్య ఆర్థిక లోటు రూ.11.91కి చేరింది. ఇది మెుత్తం ఏడాదికి ఉన్న దానిలో దాదాపు 68 శాతం కావటం కొంత ఆందోళనను కలిగిస్తోంది. వీటికి తోడు ఇండియా విక్స్, కార్పొరేట్ యాక్షన్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడులు, టెక్నికల్ వ్యూ వంటి అంశాలు మార్కెట్లలో చాలా కీలకమైన అంశాలలో ఒకటిగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వచ్చే వారం ఇన్వెస్టర్లు కొంత ఆచితూచి ముందుకు సాగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications