భారతదేశంలోని రెండవ అతిపెద్ద IT సేవల సంస్థ Infosys Ltd హైదరాబాద్‌లోని పోచారంలో IT క్యాంపస్ విస్తరింపు పై తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల కొత్తగా 17,000 ఉద్యోగాలు లభిస్తాయని, టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని భావిస్తున్నారు.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్‌రాజ్కా అండ్ తెలంగాణ ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రకటన వెలువడిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్‌లో ఇప్పటికే 35,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు, రానున్న 2-3 సంవత్సరాలలో మొదటి దశ విస్తరణ పూర్తి చేయాలని చూస్తుంది. ఈ దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాలను నిర్మించి, 10 వేల మంది ఉద్యోగుల కోసం స్థలాన్ని సృష్టించనున్నారు.
విప్రో
అంతేకాదు టాప్-5 భారతీయ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో హైదరాబాదు క్యాంపస్ విస్తరించాలనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేసే ఈ సెంటర్ ద్వారా దాదాపు 5000 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తుంది. నిజానికి దావోస్ వేదికగా జరుగుతున్న వ్యాపార చర్చల్లో పాల్గొన్న విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో చర్చల తర్వాత ఈ విషయాన్నీ ప్రకటించారు.
విప్రో ప్రకటించిన కొత్త సెంటర్ నిర్మాణం పూర్తి కావడానికి అలాగే అందుబాటులోకి రావటానికి కనీసం 2-3 ఏళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డీ సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు సీఎం. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయటం ఆనందంగా ఉందని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు.
హెచ్సిఎల్
దేశంలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న మరో ప్రముఖ టెక్నాలజీ కంపెనీ HCLTech. కూడా వ్యాపారాన్ని హైదరాబాదులో మరింతగా విస్తరించాలని చూస్తోంది. దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన హెచ్సీఎల్ సీఈవో, ఎండీ విజయకుమార్ ఈ మేరకు కొత్త పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటించారు.
హైదరాబాదులోని కొత్త సెంటర్ హైటెక్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పరిశ్రమల్లోని గ్లోబల్ క్లయింట్‌లకు అత్యాధునిక క్లౌడ్, ఏఐ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్స్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. టెక్ కంపెనీకి హైటెక్ సిటీలో ఉన్న క్యాంపస్ కొత్తగా 5,000 మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు.
దేశీయ ఐటీ కంపెనీలు విస్తరణకు హైదరాబాదును అనుకూలమైన నగరంగా సెలెక్ట్ చేయటంతో సాంకేతిక రంగంలో తెలంగాణ వేగంగా వృద్ధిని సాధించటంతో పాటు యువతకు మెరుగైవ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications