Wipro Q1 Results: దేశీయ టాప్ ఐటీ దిగ్గజం విప్రో నేడు మార్కెట్లు ముగిసిన తర్వాత తన క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దీనికి ముందు టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తమ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో ఐటీ కంపెనీలపై ట్రేడర్లు భారీగా బెట్టింగ్ వేస్తున్నారు.
ప్రస్తుతం ఐటీ కంపెనీల కార్పొరేట్ ఫలితాలు మెరుగుపడిన పనితీరుతో పాటు వ్యాపారంలో పునరుద్ధరణను సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నేడు టాప్ 5 టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఎఫ్‌వై25 నికర లాభం మార్కెట్ అంచనాలను అధిగమించి ఏడాది ప్రాతిపదికన 4.6 శాతం పెరిగి రూ.3,003 కోట్లుగా నమోదు చేసింది. అయితే కంపెనీ ఏప్రిల్-జూన్ కన్సాలిడేటెడ్ ఆదాయం 3.8 శాతం తగ్గి రూ.21,964 కోట్లుగా నమోదైంది.

కంపెనీ ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి ఆదాయం 2.6 బిలియన్ డాలర్ల నుంచి 2.65 బిలియన్ డాలర్ల పరిధిలో ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని మందగమనం కారణంగా కంపెనీల విచక్షణతో కూడిన ఖర్చులు, ఏఐ డీల్స్ వేగాన్ని పుంజుకునే సంకేతాలతో గుర్తించబడ్డాయి. ఖచ్చితంగా చెప్పాలంటే టెక్ కంపెనీలు ఇంకా పూర్తిగా కష్టాల నుంచి బయటపడలేదని చెప్పుకోవచ్చని ప్రస్తుత పరిస్థితులు హైలైట్ చేస్తున్నాయి. అయితే టెక్ పరిశ్రమలో పూర్తి స్థాయి రికవరీక మరో రెండు త్రైమాసికాలు సమయం వేచి చూడాలని నిపుణులు భావిస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో కంపెనీ అతిపెద్ద విజయంతో $1 బిలియన్ కంటే ఎక్కువ మొత్తం డీల్ బుకింగ్‌లలో మరో త్రైమాసికం నిలిచిందని సీఈవో శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీనికి అమెరికా 1 SMU, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, కన్జూమర్ రంగాల్లో మెరుగుపడిన వ్యాపారం దోహదపడిందని చెప్పారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ ఈ త్రైమాసికంలో కొత్త సీఈవో నేతృత్వంలో 1.2 బిలియన్ డాలర్లు విలువైన డీల్స్ సొంతం చేసుకుంది. అలాగే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్‌ను ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 42 బేసిస్ పాయింట్లు పెరిగి 16.5 శాతానికి విస్తరించిందని విప్రో సీఎఫ్‌వో అపర్ణ అయ్యర్ తెలిపారు.


Click it and Unblock the Notifications