IT News: 2025లో టెక్కీలకు తీపి కబురు.. సర్ప్రైజ్ సిద్ధంగా ఉంచిన TCS, Infosys, HCL, Wipro..!

Tech Hirings: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కుదుటపడుతున్న వేళ భారతీయ ఐటీ పరిశ్రమ కూడా మంచి రోజులను తిరిగి చూస్తోంది. గడచిన కొన్నేళ్లుగా మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలు ప్రస్తుతం తిరిగి వ్యాపారాలను గాడిన పెడుతున్నాయి. ఇటీవలి టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా దీనినే రుజువు చేస్తున్నాయి.

డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను జాగ్రత్తగా పరిశీలిస్తే టెక్ ఫ్రెషర్లకు, లేటరల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న టెక్కీలకు ఒక శుభవార్త అందులో దాగి ఉంది. అదేంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ పెద్దగా ఉద్యోగుల సంఖ్యను పెంచనప్పటికీ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను నియమించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కంపెనీల వ్యాపారాలు మెరుగుపడటాన్ని కూడా సూచిస్తోంది.

Top Indian Tech Companies TCS Infosys HCL Wipro planning to hire 70k Freshers

భారతీయ ఐటీ కంపెనీలకు ప్రధానంగా ఆదాయం వచ్చే యూఎస్, యూకే మార్కెట్లలోని క్లయింట్లు తమ టెక్ స్పెండింగ్ ప్రారంభించిన వేళ భారతీయ ఐటీ కంపెనీలు మంచి ఆర్డర్ పైప్ లైన్ చూస్తున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో పెరగనున్న ఉద్యోగ అవకాశాలను సూచిస్తోంది.

ఈ క్రమంలో ముందుగా ఐటీ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్ అయిన టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో టోటల్ హెడ్ కౌంట్ స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య 607,354గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక పోతే అట్రిషన్ రేటు 13 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా దాదాపు 40,000 మంది టెక్ ఫ్రెషర్లను హైర్ చేసుకోవాలని నిర్ణయించినట్లు పెద్ద శుభవార్తను వెల్లడించింది.

ఇకపోతే మరో టాప్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తమ మూడవ త్రైమాసిక లెక్కల్లో స్వల్పంగా ఉద్యోగుల సంఖ్య పెరుగుదలతో మెుత్తం టెక్కీల సంఖ్య 323379 ఉన్నట్లు ప్రకటించింది. అలాగే ఈ ఏడాది దాదాపు 20 వేల మంది టెక్ ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇదే సమయంలో విప్రో కొంత ఉద్యోగుల సంఖ్య తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ కూడా భవిష్యత్తు అవసరాల దృష్యా 10-12 వేల మంది ప్రెషర్లను నియమించుకుంటానని పేర్కొంది.

ఇక చివరిగా టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాల్లో ఉద్యోగుల సంఖ్య స్వల్ప తగ్గింపుతో ప్రస్తుతం 2,20,755 మంది పనిచేస్తున్నట్లు నివేదించింది. ఈ క్రమంలో కంపెనీ కూడా అవసరాలకు అనుగుణంగా దాదాపు 7000 మంది ఫ్రెష్ టెక్కీలను నియమించుకుంటున్నట్లు వెల్లడించటం గమనార్హం. మెుత్తం మీద కేవలం టాప్ టెక్ కంపెనీలు సమీప భవిష్యత్తులో 70,000 మందిని రిక్రూట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇక మధ్య, చిన్న టెక్ కంపెనీలు సైతం ఇదే తరహాలో ఉద్యోగుల సంఖ్యలను పెంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+