Wipro News: భారత ఐటీ సేవల రంగం వ్యాపార విలువ దాదాపు 245 బిలియన్ డాలర్లు. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ సేవలకు డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని త్రైమాసికాలుగా వీటి వ్యాపారం దిగజారటంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే టాప్ ఇండియన్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో తన ఉద్యోగులకు పెద్ద షాకింగ్ వార్తకు సిద్ధమైంది. కంపెనీ కొందరు ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్ ఆదారంగా.. డిసెంబర్‌లో రాబోయే రౌండ్ వేతన సవరణల్లో టెక్ దిగ్గజం మంచి పనితీరును కనబరుస్తూ మంచి ఎక్కువ వేతనాన్ని అందుకుంటున్న ఉద్యోగులకు హైక్స్ ఇవ్వకుండా దాటవేయవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మందగమనంతో అనేక అమెరికా, యూరోపియన్ మార్కెట్లలోని క్లయింట్స్ తమ ఖర్చులను వేగంగా తగ్గించుకుంటున్నాయి. దీంతో ఈ మార్కెట్లపై ఆదారపడిన దేశీయ టెక్ కంపెనీలు తక్కువ డీల్స్, తగ్గిన ఆదాయాలు, ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ, తగ్గిన మార్జిన్లు లాభదాయకత, పెరుగుతున్న ఉద్యోగుల ఖర్చులు వంటి వాటితో భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి కఠిన వ్యాపార వాతావరణంలో దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న విప్రో తాజా చర్యలకు వచ్చింది.
"మేము మా వ్యాపార స్థోమత ఆధారంగా సెలెక్టివ్ MSI(మెరిట్ జీతాల పెంపుదల) రోల్‌అవుట్ చేస్తున్నాము" అని "ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్" బిజినెస్ లైన్ మేనేజింగ్ పార్ట్‌నర్, ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు ఉద్యోగులకు ఈ-మెయిల్‌లో తెలిపారు. విప్రో వేతన పెంపునకు అర్హత ఉన్నవారిలో తక్కువ పరిహారంతో ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తుందని బండారు పేర్కొన్నారు. అలాగే అధిక పరిహారంతో అత్యుత్తమ పనితీరు కనబరిచినవారు ఈ సైకిల్‌లో కవర్ చేయబడరని స్పష్టం చేశారు. ఉద్యోగులు పెరిగిన వేతనాలను డిసెంబర్ 1న అందుకుంటారని తెలుస్తోంది.
కంపెనీ తీసుకున్న తాజా చర్యలు ఉద్యోగుల్లో ధైర్యాన్ని ప్రభావితం చేస్తుందని వారి నైతికతను క్షీణింపజేస్తుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అదనపు అట్రిషన్ డిమాండ్‌ను తీర్చడానికి బెంచ్‌లను రీబ్యాలెన్స్ చేయడంలో సహాయపడుందని వారు అంటున్నారు. అలాగే సెప్టెంబర్ 30 నాటికి 244,707 మంది ఉద్యోగులను కలిగి ఉన్న విప్రో ఇప్పటికే తన జీతాల పెంపును ఆలస్యం చేసింది. అయితే ఈ విషయంపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications