IT News: కాలేజీల్లో ఇంజనీర్లకు ఐటీ కంపెనీల శుభవార్త.. TCS, Infosys దూకుడు..

IT Hirings: ప్రపంచ వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అనేక సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సైతం తగ్గించటం శుభపరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ టెక్ కంపెనీలు తమ స్పెండింగ్ పెంచుతున్నాయి. ఇది భారతీయ ఐటీ పరిశ్రమంలోని కంపెనీలకు కొత్త ఆర్డర్ బుక్ పెంచుతున్నాయి.

ఈ పరిణామాలతో దేశీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలు గణనీయంగా తమ రిక్రూట్మెంట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో టాప్ టెక్ కంపెనీలు క్యాంపస్ హైరింగ్ పెంచుతున్నట్లు తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల నియామకాలు 20-25 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. ప్రధానంగా కంపెనీలు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనాలసిస్ రంగాల్లో కొత్త ఉద్యోగ నియమాకాలను చూస్తున్నట్లు ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ కారణంగా క్యాంపర్ ప్లేస్మెంట్లకు కంపెనీలు దూరంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఏకంగా తాము క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించబోమని వెల్లడించిన సంగతి కూడా చూశాం.

IT Hirings 20-25 2024 2024-25 -5 3000 10-12 5000 40 000 20 000

అయితే ప్రస్తుతం దేశీయ టెక్ కంపెనీలు డిజిటల్ పరివర్తన కార్యక్రమాలను నడపడానికి, నైపుణ్యం అంతరాలను పూరించడానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఫ్రెషర్లను నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ప్రస్తుతం వ్యాపారాలు తిరిగి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ టెక్ కంపెనీలు పాజ్ చేసిన రిక్రూట్మెంట్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాయి. ఈ క్రమంలో చాలా కాలంగా ఆఫర్ లెటర్లు అందుకుని ఆన్ బోర్డింగ్ కోసం వేచి ఉన్న వేల మంది ఇన్‌టేక్‌లను తిరిగి ఆన్ బోర్డ్ చేస్తున్నాయి. మెుత్తానికి 2024లో ఆటోమేషన్, వర్క్‌ఫోర్స్ ఆప్టిమైజేషన్ వంటి కారణాలతో నియామకాలను పెంచుతున్నాయి. 2024-25 రికవరీ సంకేతాల మధ్య ఇది కొనసాగుతోందని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ అన్నారు.

ప్రస్తుతం టాప్-5 టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రాలు న్యూ హైరింగ్స్ విషయంలో అగ్రగాములుగా కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో విప్రో దాదాపు 3000 మంది నెక్స్ట్ జెన్ అసోసియేట్‌లను ఆన్ బోర్డ్ చేయగా.. మరో 10-12 వేల మందిని నియమించుకోవాలని చూస్తోందని సమాచారం. ఈ క్రమంలో కంపెనీ విద్యా సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని తెలుస్తోంది. ఇక టెక్ మహీంద్రా 5000 మంది టెక్కీలను నియమించుకోవాలని చూస్తోంది. ఇక రిక్రూట్మెంట్ల విషయంలో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ తొలి స్థానంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలనే ప్రణాళికను ప్రకటించింది. ఇక కొత్త టెక్కీల నియామకాల విషయంలో ఇన్ఫోసిస్ రెండవ స్థానంలో కొనసాగుతూ 20,000 మందిని క్యాంపస్ రిక్రూట్‌ ద్వారా తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+