Donations: అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠతో దేశం మొత్తం రామనామం మారుమ్రోగిపోయింది. ప్రధాని నుంచి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఈ చారిత్రక కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే ఈ స్థాయిలో ఆలయ నిర్మాణానికి సామాన్యుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు భారీ విరాళాలు సమర్పించారు.
దేశ, విదేశాల్లోని భక్తుల విరాళాలతో అయోధ్యలో రామ మందిరం నిర్మించబడింది. దీనికోసం సేకరించిన విరాళాలు ఇప్పటివరకు 5 వేల 500 కోట్లు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. భక్తుల ఉదారంగా విరాళాలు ఇవ్వడంతోనే ఇంతటి పెద్ద ప్రాజెక్ట్ సునాయాసంగా పూర్తైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లఖి మరియు అతని కుటుంబ సభ్యులు ఈ పుణ్యాకార్యానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ఏకంగా 101 కిలోల బంగారాన్ని రాముడికి కానుకగా సమర్పించారు. వాటి విలువ 68 కోట్లకు పైమాటే. దీనితో రామమందిరం తలుపులు, గర్భగుడి త్రిశూలం, డమరు సహా స్తంభాలను అలంకరించారు.
రామమందిర నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు 11.3 కోట్లు అందించారు. అమెరికా, కెనడా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆయన మద్దతుదారులు కూడా వ్యక్తిగతంగా 8 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. దీంతో ఆయన తరపు నుంచి ఆలయానికి అందిన మొత్తం 18.6 కోట్లని తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం.. గుజరాత్‌లోని శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన గోవింద్‌భాయ్ ధోలాకియా ఆలయానికి 11 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. పాట్నా మహావీర్ మందిర్ 10 కోట్లు, స్విస్ గ్లాస్‌కోట్ ఎక్విప్‌మెంట్స్‌కు చెందిన మహేష్ కబుతర్‌వాలా 5 కోట్లు, ఇండియా సహా ఆసియాలో అత్యంత సంపన్న అంబానీ కుటుంబం జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు 2.51 కోట్లు మేర విరాళంగా అందించారు.
మాతృశ్రీ కంకుబా ఫౌండేషన్‌కు చెందిన లావ్‌జీ బాద్‌షా 1 కోటి విరాళం అందించారని నివేదికలు చెబుతున్నాయి. వీరితో పాటు చెన్నైకి చెందిన డబ్ల్యూఎస్ హబీబ్ అనే ముస్లిం వ్యాపారవేత్త కూడా లక్ష రూపాయలు రామమందిర నిర్మాణం కోసం విరాళం ఇచ్చినట్లు సమాచారం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications