For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ లాభపడిన బిట్ కాయిన్, ఎథేరియం: పోల్కాడాట్ 2% జంప్

|

క్రిప్టో కరెన్సీ క్రమంగా కోలుకుంటుంది. ఇటీవల 40,000 డాలర్ల దిగువకు పడిపోయిన క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇఫ్పుడు 43,000 డాలర్ల వద్ద ఉంది. అయితే భారీ పతనం అనంతరం క్రిప్టో కరెన్సీ మందగమనంగా ముందుకు సాగుతోంది. బిట్ కాయిన్ నవంబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లకు చేరుకుంది. ఆ స్థాయితో పోలిస్తే ఇప్పుడు 26000 డాలర్లు తక్కువగా ఉంది. బిట్ కాయిన్, ఎథేరియం సహా ఇతర క్రిప్టోలు క్రమంగా పుంజుకుంటున్నాయి.

శుక్రవారం ప్రారంభంలో బిట్ కాయిన్ సహా ఎనిమిది క్రిప్టోలు పతనం కాగా, రెండు మాత్రమే లాభపడ్డాయి. యూఎస్డీ కాయిన్, పోల్కాడాట్ లాభపడగా, ఇతర క్రిప్టోలు ప్రారంభంలో నష్టపోయాయి. బిట్ కాయిన్, ఎథేరియం, సోలోనా, బీఎన్బీ, కార్డానో, ఎక్స్‌ఆర్పీ, టెర్రా 2 శాతం నుండి అంతకంటే ఎక్కువగా నష్టపోయాయి. కానీ యూఎస్డీ కాయిన్ మాత్రం స్వల్పంగా లాభపడింది. పోల్కాడాట్ రెండు శాతం మేర ఎగిసింది. అయితే సాయంత్రానికి బిట్ కాయిన్ దాదాపు ఒక శాతం మేర లాభాల్లోకి వచ్చింది. ఎథేరియం కూడా అదే దారిలో నడిచింది.

cryptocurrency

గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం ఉదయం నాటికి 2.03 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 101.84 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, లండన్ ట్రాన్సుపోర్టులో క్రిప్టో కరెన్సీ యాడ్స్ సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తున్నాయి. ఈ రిస్కింగ్ పెట్టుబడి వద్దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary

మళ్లీ లాభపడిన బిట్ కాయిన్, ఎథేరియం: పోల్కాడాట్ 2% జంప్ | Top cryptocurrency prices today: Bitcoin, Ethereum erase gains

After a brief pause, the downtrend in crypto market resumed with Bitcoin erasing the gains of previous day. Altcoins, as always, followed the numero uno token.
Story first published: Friday, January 14, 2022, 22:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X