బిట్ కాయిన్, ఎథేరియం భారీగా పతనం, షిబా ఇను 3% డౌన్
క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ నేడు క్షీణించింది. క్రిప్టో దిగ్గజాలు బిట్ కాయిన్, ఎథేరియం సహా ఎక్కువ క్రిప్టోలు గత ఇరవై నాలుగు గంటల్లో పతనమయ్యాయి. ఎక్స్‌ఆర్‌పీ, కార్డనో, అవాలాంచె, టెర్రా యూఎస్‌డీ వంటి కొన్ని మాత్రమే లాభాల్లో ఉన్నాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను కూడా ఒక శాతం వరకు నష్టపోయాయి.
ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు 1.54 శాతం క్షీణించి 38,236 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం 0.31 శాతం తగ్గి 2,822 డాలర్లు, టెర్రా 0.93 శాతం తగ్గి 83.46 డాలర్లు, సోలానా 1.76 శాతం తగ్గి 87.11 డాలర్లు, క్రిప్టో డాట్ కామ్ 0.52 శాతం తగ్గి 0.2914 డాలర్లు, స్టెల్లార్ 0.96 శాతం తగ్గి 0.1736 డాలర్లు, డోజీకాయిన్ 0.67 శాతం క్షీణించి 0.1299 డాలర్లు, పోల్కాడాట్ 0.44 శాతం తగ్గి 14.99 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎక్స్‌ఆర్‌పీ, 0.67 శాతం, కార్డానో 1.26 శాతం, అవాలాంచె 1.91 శాతం, టెర్రా యూఎస్‌డీ 0.01 శాతం లాభపడ్డాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్గోరాండ్ 12.37 శాతం, ట్రోన్ 7.65 శాతం, రెన్ 4.12 శాతం, సింథెటిక్స్ 3.81 శాతం, ది శాండ్ బాక్స్ 3.70 శాతం, కాస్మోస్ 3.29 శాతం లాభపడ్డాయి. అదే సమయంలో కైబర్ నెట్ వర్క్ 9.39 శాతం, ఎక్స్‌వైఓ నెట్ వర్క్ 8.12 శాతం, డిస్ట్రిక్ట్ ఓఎక్స్ 5.05 శాతం, అల్కామీ పే 3.13 శాతం క్షీణించాయి.


Click it and Unblock the Notifications