క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ నేడు ఎంత ఉందంటే? బిట్ కాయిన్, ఎథేరియం డౌన్
క్రిప్టోకరెన్సీ నేడు (జూలై 8, గురువారం) మిశ్రమంగా ఉంది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం రోజు 1.83 శాతం క్షీణించింది. దీంతో మార్కెట్ క్యాప్ 1.42 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే నేడు మాత్రం క్రిప్టో మార్కెట్ క్యాప్ 0.71 శాతం పెరిగింది. ప్రస్తుతం క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ 34,611.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ వాటా 44 శాతానికి పైగా ఉంది. ఒకరోజులో 0.28 శాతం క్షీణించింది. స్టేబుల్ బిట్ కాయిన్ వ్యాల్యూమ్ 76.47 శాతంగా ఉంది.
డోజీకాయిన్, XRP సహా వివిధ బిట్ కాయిన్స్, యూనీస్వాప్ నష్టపోయాయి. బిట్ కాయిన్ వ్యాల్యూ 33,360.46 డాలర్లుగా ఉంది. 3% మేర క్షీణించింది. ఇతర కరెన్సీల విషయానికి వస్తే ఎథేరియం 3.55 శాతం క్షీణించి 2,257.03 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 2.20 శాతం క్షణించి 321.67 డాలర్ల వద్ద, టెథెర్ 0.070 శాతం క్షీణించి 1.00 డాలర్ వద్ద, కార్డానో 3.16 శాతం క్షీణించి 1.38 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 1.02 శాతం క్షీణించి 6.78 డాలర్ల వద్ద, XRP 4.75 శాతం క్షీణించి 0.64 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 2.90 శాతం క్షీణించి 16.17 డాలర్ల వద్ద, USD కాయిన్ 0.070 శాతం క్షీణించి 1 డాలర్ల వద్ద, యూనిస్వాప్ 5.06 శాతం క్షీణించి 21.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

క్రిప్టో కరెన్సీ ఒక వర్చువల్ కరెన్సీ. దీనిని ప్టో మనీ, క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. వీటి వ్యాల్యూ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంది.


Click it and Unblock the Notifications