బిట్ కాయిన్ మళ్లీ జంప్, సోలానా 9 శాతంతో అదరగొట్టింది
క్రిప్టో కరెన్సీలు ఆగస్ట్ 29 లాభపడ్డాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీలు నేడు ప్రారంభ సెషన్‌లో భారీగా లాభపడ్డాయి. బిట్ కాయిన్ మే నెలలో ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్లను తాకింది. ఆ తర్వాత కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల కోలుకుంటోంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. పది సెషన్ల క్రితం 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. మూడు సెషన్లుగా కాస్త తగ్గినప్పటికీ ఇప్పుడు 48,000 డాలర్ల పైన ఉంది.
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.12 ట్రిలియన్ డాలర్లుగా నమోది అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇది 0.46 శాతం అధికం. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 92.21 బిలియన డాలర్లుగా ఉంది. అన్ని స్టేబుల్ కాయిన్స్ వ్యాల్యూమ్ 70.48 బిలియన్ డాలర్లుగా ఉంది. బిట్ కాయిన్ 49,357 డాలర్లను తాకింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ, సానుకూలంగానే ఉంది. అంతకుముందు రోజుతో పోలిస్తే బిట్ కాయిన్ డామినెన్స్ 43.74 శాతంగా నమోదయింది.

నేటి ఉదయం వివిధ కరెన్సీ వ్యాల్యూలు
- Bitcoin BTC - $49,341.14 - 0.59 శాతం జంప్
- Ethereum ETH - $3,273.91 - 0.65 శాతం జంప్
- Cardano ADA - $2.84 - 0.53 శాతం క్షీణత
- Binance Coin BNB - $493.70 - 0.88 శాతం వృద్ధి
- Tether USDT - $1.00 - 0.2 శాతం క్షీణత
- Dogecoin - 0.29 - 2.20 శాతం క్షీణత
- XRP - $1.16 - 1.45 శాతం క్షీణత
- USD Coin USDC - $1.00 - 0.00 శాతం
- Polkadot DOT - $26.34 - 0.29 శాతం వృద్ధి
- Solana SOL - $95.80 - 9.64 శాతం వృద్ధి.


Click it and Unblock the Notifications