Crypto Currencies: క్రిప్టో మార్కెట్లలో ఇది మంచి వారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కరెన్సీలు మరింత పతనమవుతాయనే అంచనాలను దాటుకుని కీలక క్రిప్టోలు దూసుకుపోతున్నాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ సైకలాజికల్ ఒక ట్రిలియన్ స్థాయిని తాకింది. ప్రస్తుతం అగ్ర క్రిప్టోలుగా చలామణి అవుతున్న బిట్‌కాయిన్ (BTC) 23,000 డాలర్లు, ఎథెరియం (ETH) 1550 డాలర్లకు చేరుకున్నాయి. గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ గత 24 గంటల్లో(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.10 గంటలకు) 4.8% పెరిగి 1.12 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
బిట్‌కాయిన్, ఎథెరియం వరుసగా మరో రోజు ర్యాలీని కొనసాగించాయి. CoinMarketCap డేటా ప్రకారం.. Bitcoin ఆధిపత్యం ఇప్పుడు 42.2% వద్ద ఉండగా, మొత్తం క్రిప్టో మార్కెట్‌ల్లో ఎథెరియం 17.9% ఆధిపత్యాన్ని కలిగి ఉంది. Ethereum గత వారంలో 45% కంటే ఎక్కువ పెరిగింది.
జూలై 20న టాప్ క్రిప్టో ధరలు..

Ethereum (ETH)
గత 24 గంటల్లో Ethereum ధర దాదాపు 3.22% పెరిగి 1,568 డాలర్లకు చేరుకుంది. గత 7 రోజుల్లో ETH ధర 48% పైగా పెరిగింది. ఇది ప్రస్తుతం రెండవ అతిపెద్ద క్రిప్టో ఆస్తిగా కొనసాగుతోంది.
Binance (BNB): బినాన్స్ చైన్ కాయిన్ ధర 270 డాలర్లు పెరిగింది. గత 24 గంటల్లో 4.57% పెరిగగా.. గత 7 రోజుల్లో BNB ధర 20 శాతానికి పైగా పెరిగింది. ఇది ప్రస్తుతం 5వ అతిపెద్ద క్రిప్టో ఆస్తిగా ఉంది.
XRP: గత 24 గంటల్లో XRP కాయిన్ ధర 6.51% పెరిగి 0.3802 డాలర్లకు చేరుకుంది. గత 7 రోజుల్లో.. XRP కాయిన్ ధర దాదాపు 21% పెరిగింది. ఇది ప్రస్తుతం 6వ అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా నిలిచింది.

Solana (SOL)):
గత 24 గంటల్లో సోలానా ధర 6% పెరిగి 45.67 డాలర్లకు చేరుకుంది. గత 7 రోజుల్లో.. SOL ధర దాదాపు 37% పెరిగింది. ఇది ప్రస్తుతం 9వ అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా గుర్తింపు పొందింది.
Cardano (ADA): గత 24 గంటల్లో కార్డానో టోకెన్ ధర 12% పెరిగి 0.5376 డాలర్లకు చేరుకుంది. గత 7 రోజుల్లో.. ADA ధర 26.57% పెరిగింది. ఇది ప్రస్తుతం 7వ అతిపెద్ద క్రిప్టోగా కొనసాగుతోంది.
Dogecoin (DOGE): డోజ్ కాయిన్ ధర గత 24 గంటల్లో 9% తగ్గింది. DOGE ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది. ఈ నివేదిక సమయంలో DOGE ధర 0.07172 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Polkadot (DOT):
పోల్కాడోట్ ధర గత 7 రోజుల్లో 25.57% పెరిగి 8.03 డాలర్లకు చేరుకుంది. అవలాంచె (AVAX) ధర 7 రోజుల్లో దాదాపు 50% పెరిగి గత 24 గంటల్లో 25.71 డాలర్లకు చేరుకుంది. DOT, AVAX రెండూ ప్రస్తుతం CoinMarketCapలో వరుసగా 11, 13వ స్థానాల్లో ఉన్నాయి.
Polygon (Matic): గత 24 గంటల్లో పాలిగాన్ కరెన్సీ ధర 4.67% పెరిగి 0.9442 డాలర్లకు చేరుకుంది. గత 7 రోజుల్లో.. MATIC ధర దాదాపు 71% పెరిగింది. ఇది ప్రస్తుతం CoinMarketCapలో ఇది 12వ స్థానంలో ఉంది.
Shiba Inu (SHIB): షిబా ఇను క్రిప్టో కరెన్సీ గత 24 గంటల్లో 9.24% పెరిగి 0.0000126 డాలర్లకు చేరుకుంది. ఇది ప్రస్తుతం CoinMarketCapలో 15వ స్థానంలో కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications