Gold reserves: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం మరియు వెండిపై కీలక ఉపశమనం ప్రకటించారు. దీంతో పసిడి ధరలు ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయి. సాధారణంగానే భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడతారు. ప్రతి శుభకార్యంలో ఈ పసుపు మెటల్ కీలక పాత్ర పోషిస్తుంది. కాలం కూడా కలిసి వచ్చి ధరలు కుప్పకూలడంతో అతివలు జ్యూయలరీ షాపులకు క్యూ కట్టారు.
గ్లోబల్ గోల్డ్ రిజర్వ్‌లలో భారతదేశం గణనీయమైన వాటా కలిగి ఉంది. అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో 9వ స్థానాన్ని ఆక్రమించింది. పసిడి పట్ల ఇండియన్స్‌కు గొప్ప సాంస్కృతిక అనుబంధం ఉంది. చరిత్ర చూస్తే భారతీయ బంగారు నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వంతో పాటు వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక అనిశ్చితి వేళ విశ్వసనీయమైన విలువ కలిగిన స్టోర్‌గా బంగారం పనిచేస్తుంది.

1970లలో అధికారికంగా రద్దు చేయబడినప్పటికీ, అనేక దేశాలు బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా కాలంతో పాటు వాటిని పెంచుకుంటూ పోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్‌లు ఈ సురక్షిత ఆస్తి కూడబెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం Q1, 2024లో బంగారం నిల్వల ర్యాంకింగ్‌లు ఇలా ఉన్నాయి.
బంగారం వెనకేసుకోవడంలోనూ అగ్రరాజ్యం అమెరికా ముందంజలో ఉంది. ఏకంగా 8 వేల 133 టన్నుల బంగారాన్ని నిల్వ చేసుకుంది. 3 వేల 352 టన్నులతో జర్మనీ, 2 వేల 451 టన్నులతో ఇటలీ, 2 వేల 436 టన్నులతో ఫ్రాన్స్ మరియు 2 వేల 332 టన్నులతో రష్యా వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బంగారాన్ని ఎక్కువగా వినియోగించే చైనా మాత్రం 2 వేల 262 టన్నులతో ఆరో ప్లేస్‌లో ఆగిపోయింది. ఇక భారత్ 822 టన్నులతో 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications