Investment: మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. అయితే ఆ ఆనందం ఈక్విటీ మార్కెట్లలో మాత్రం ఇంకా కనిపించటం లేదు. ద్రవ్యోల్బణం వల్ల తీసుకుంటున్న అనేక చర్యల వల్ల బలహీనమైన ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో టాప్-10 అత్యంత విలువైన కంపెనీలు సైతం వెనుకబడ్డాయి. వాటిలోని తొమ్మిది కంపెనీల విలువ క్షీణించింది.

క్షీణత ప్రభావం..
టాప్-10 అత్యంత విలువైన సంస్థల్లో తొమ్మిది గతవారం మార్కెట్ విలువలో రూ.1,22,092.9 కోట్ల క్షీణతను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో బీఎస్ఈ బెంచ్ మార్క్ సూచీ సైతం గతవారం పాయింట్లు లేదా 1.36 శాతం క్షీణించింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్‌తో సహా మరికొన్ని బాహుబలి కంపెనీల విలువ ఆవిరైంది.

టాప్-5 కంపెనీల పరిస్థితి..
రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్ రూ.29,767.66 కోట్లు తగ్గి రూ.17,35,405.81 కోట్లకు చేరుకుంది. TCS తన మార్కెట్ వాల్యుయేషన్‌లో రూ.19,960.12 కోట్ల క్షీణతతో రూ.11,84,837.43 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.19,722.3 కోట్లు తగ్గి రూ.6,29,380.54 కోట్లకు, ఇన్ఫోసిస్ విలువ రూ.19,567.57 కోట్లు పతనమై రూ.6,40,617.19 కోట్లకు పడిపోయింది. హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,935.92 కోట్లు తగ్గి రూ.6,27,434.85 కోట్లకు చేరుకుంది.

మిగిలిన కంపెనీలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.11,735.86 కోట్లు తగ్గి రూ.5,38,421.83 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.7,204.38 కోట్లు తగ్గి రూ.4,57,325.46 కోట్లకు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ విలువ రూ.1,903.8 కోట్లు తగ్గి రూ.4,53,617.85 కోట్లకు పడిపోయింది. ఇక HDFC mcap రూ.295.29 కోట్లు తగ్గి రూ.4,86,460.48 కోట్లకు చేరుకుంది. చివరగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం రూ.4,126.18 కోట్లను జోడించి దాని విలువను రూ.9,13,726.29 కోట్లకు పెంచుకుంది.


Click it and Unblock the Notifications