Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలోని టాప్-10 అత్యంత విలువైన సెన్సెక్స్ కంపెనీల్లో ఆరింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం ఏకంగా రూ.1,73,097.59 కోట్లు క్షీణతను నమోదు చేసింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ఐసీ కంపెనీల షేర్లు అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. గడచిన వారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,213.68 పాయింట్లు నష్టపోయింది.
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.60,678.26 కోట్లు తగ్గి రూ.10,93,026.58 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,168.1 కోట్లు తగ్గి రూ.5,76,049.17 కోట్లకు చేరింది. అలాగే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,094.96 కోట్లు తగ్గి రూ.19,04,643.44 కోట్లకు తగ్గింది. ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,567.94 కోట్లు క్షీణించి రూ.7,84,833.83 కోట్లకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ.11,780.49 కోట్లు తగ్గి రూ.7,30,345.62 కోట్లకు పడిపోయాయి. ఇదే క్రమంలో ఐటీసీ వాల్యుయేషన్ రూ.3,807.84 కోట్లు తగ్గి రూ.5,40,838.13 కోట్లకు చేరింది.

ఇదే క్రమంలో టాప్ కంపెనీల జాబితాలోని మార్కెట్ ట్రెండ్‌కి విరుద్ధంగా.. హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,270.22 కోట్లు పెరిగి రూ.5,53,822.16 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గతవారంలో రూ.20,442.2 కోట్లు జోడించగా.. టెక్ దిగ్గజ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.14,09,552.63 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో ఎయిర్‌టెల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,653.98 కోట్లు పెరిగి రూ.7,38,424.68 కోట్లకు చేరగా, ఇన్ఫోసిస్ వాల్యుయేషన్ రూ.3,611.26 కోట్లు పెరిగి రూ.5,91,560.88 కోట్లకు చేరింది.
టాప్- 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్‌ఐసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ కంపెనీలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications