AI మీద డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్న కంపెనీలు.. ఒక్కో ఉద్యోగిపై ఏకంగా రూ.7 లక్షల పైమాటే..

సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఆధునిక కంపెనీలు తమ ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వైపు వేగంగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఏఐ సాధనాలు, ప్రాసెసింగ్ కోసం అయ్యే వ్యయం కార్పొరేట్ సంస్థలకు భారీ భారంగా మారుతోంది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల ఆర్థిక నిర్వహణను పరిశీలిస్తూ రాంప్ విడుదల చేసిన నూతన ఏఐ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. అగ్రశ్రేణి 1 శాతం కంపెనీలు ప్రస్తుతం తమ ఒక్కో ఉద్యోగికి ఏఐ టూల్స్ కోసం సగటున 7,400 డాలర్లు (దాదాపు రూ. 7 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

ఈ ఏఐ వినియోగ వ్యయం అత్యంత వేగంగా పెరుగుతుండటం గమనార్హం. ఇదే ఏడాది జనవరి నెలలో అగ్రశ్రేణి 1 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగికి సగటున $2,590 (దాదాపు రూ. 2.47 లక్షలు) మాత్రమే ఖర్చు చేయగా.. గడచిన కొద్ది నెలల్లోనే ఈ వ్యయం ఏకంగా మూడు రెట్లకు పైగా పెరిగింది. ప్రధాన ఏఐ పరిశోధనా సంస్థలైన ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు ప్రాసెసింగ్ నిమిత్తం 'పర్-టోకెన్' ధరల నమూనాకు (Per-Token Pricing Model) మారడమే ఈ వ్యయాల పెంపునకు ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ విధానంలో ఉద్యోగులు ఏఐ టూల్స్ ద్వారా ఎంత ఎక్కువ డేటాను, కోడింగ్‌ను లేదా సమాచారాన్ని విశ్లేషిస్తే అంత ఎక్కువ టోకెన్లు వినియోగమై కంపెనీల బిల్లులు భారీగా పెరుగుతున్నాయి.

AI spending AI spending per employee 7400 AI spending Rs 7 lakh AI spending top 1 companies AI investment AI tools cost corporate AI spending AI adoption AI Index Ramp AI Index AI spending report companies spending on AI AI budget per employee enterprise AI AI technology spending AI investment 2026 AI adoption by companies AI costs per employee AI spending AI AI AI 7 AI 1 AI AI AI technology AI investment AI AI AI AI Index AI AI adoption AI

వివిధ కంపెనీల మధ్య ఏఐ వినియోగ వ్యయాల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అగ్రశ్రేణి 1 శాతం సంస్థలు ఉద్యోగికి రూ. 7 లక్షలు ఖర్చు చేస్తుంటే.. ఆ తర్వాతి స్థానాల్లోని 10 శాతం కంపెనీలు సగటున $650 (సుమారు రూ. 62,000) వెచ్చిస్తున్నాయి. సమగ్రంగా పరిశీలిస్తే అమెరికన్ కంపెనీల సగటు (మీడియన్) ఖర్చు ఒక్కో ఉద్యోగికి $11.95 (సుమారు రూ. 1,140) గానే ఉంది. దీనిని బట్టి ఏఐ సాధనాలను విపరీతంగా ఉపయోగిస్తున్న సంస్థలకు, సాధారణంగా వాడుతున్న కంపెనీలకు మధ్య ఆర్థిక అంతరం గణనీయంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది. ఆంత్రోపిక్ సాంకేతికతను 43.5 శాతం వ్యాపారాలు వినియోగిస్తుండగా, ఓపెన్‌ఏఐ 39.7 శాతంతో ద్వితీయ స్థానంలో ఉంటే, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ఏఐ 4 శాతం వాటాతో కొనసాగుతోంది.

Also Read

పెరుగుతున్న ఈ అపరిమిత ఖర్చులను అదుపు చేసేందుకు ఉబెర్, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. తమ ఉద్యోగులు వినియోగించే రోజువారీ ఏఐ టోకెన్లపై పరిమితులు (Caps) విధించడం ప్రారంభించాయి. ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐలకు ప్రత్యామ్నాయంగా 6.1 శాతం వాటాను సేకరించిన ఓపెన్-సోర్స్, చైనా ఆధారిత ఏఐ మోడల్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు కూడా సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. కంప్యూటింగ్ ఖర్చులు ఉద్యోగుల జీతాల కంటే పెరిగిపోతున్నాయని ఎన్విడియా ప్రతినిధి బ్రయాన్ కాటన్జారో వ్యాఖ్యానించగా, త్రైమాసికంలోనే వార్షిక బడ్జెట్లు పూర్తవుతున్నాయని సామ్ ఆల్ట్‌మాన్ సైతం వ్యాఖ్యానించడం ఏఐ వ్యయ తీవ్రతకు అద్దం పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+