Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలు నేడు తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకాయి. నేడు ఇంట్రాడేలో హెవీవెయిట్ షేర్లతో పాటు ఐటీ రంగంలోని షేర్లలో ర్యాలీ మార్కెట్లను రికార్డుల దిశగా పరుగులు తీసేలా చేశాయి.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 569 పాయింట్లు లాభపడగా మరో కీలక సూచీ నిఫ్టీ 176 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 59 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 179 పాయింట్లు లాభపడింది. ఇదే క్రమంలో నేడు నిఫ్టీ బ్యాంక్ సూచీ 53000 తాజా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో నేడు ఎనర్జీ స్టాక్స్ సైతం బుల్ ర్యాలికి తమవంతు తోడ్పాటును అందించాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ తర్వాత ర్యాలీతో మార్కెట్లు గరిష్ఠాలకు చేరుకున్నాయి.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టిఐఎమ్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎయిర్ టెల్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎల్టీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, నెస్లే, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications