ఒకప్పుడు ఆఫీసు అంటే ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకే డెస్క్ దగ్గర కూర్చోవడం. కానీ 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోబోతోంది. 'ది ఇన్‌స్టంట్ గ్రూప్' నివేదిక ప్రకారం.. రాబోయే ఏడాదిలో మనం పని చేసే విధానం, పని చేసే ప్రాంతం (workplace) అలాగే మన ప్రొడక్టివిటీని ప్రభావితం చేసే అంశాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఆ 5 ప్రధాన ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. పెద్ద కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ ఆఫీసుల వైపు..
గతంలో చిన్న స్టార్టప్‌లు మాత్రమే కో-వర్కింగ్ స్పేస్‌లను వాడేవి. కానీ, ఇప్పుడు 10 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న పెద్ద కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ ఆఫీసులకే మొగ్గు చూపుతున్నాయి. సుదీర్ఘ అద్దె ఒప్పందాల రిస్క్ తీసుకోకుండా, తమకు అవసరమైనప్పుడు ఆఫీసు విస్తీర్ణాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం వంటి వెసులుబాటును ఇవి కల్పిస్తున్నాయి.
2. నగరాల కంటే.. సొంత ఊర్ల దగ్గరే ఆఫీసులు!
హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల నడిబొడ్డుకు వెళ్లి పని చేయాల్సిన అవసరం తగ్గుతోంది. 2026లో సెకండరీ సిటీలు అలాగే శివారు ప్రాంతాల్లో వర్క్ హబ్‌లు విపరీతంగా పెరగనున్నాయి. ఉద్యోగులు తమ ఇంటికి దగ్గరగా ఉన్న ప్రొఫెషనల్ ఆఫీసుల్లో కూర్చుని పని చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
3. ఆఫీసు డిజైన్ లో ఆరోగ్యం.. శ్రేయస్సు..
ఇకపై ఆఫీసు అంటే కేవలం టేబుల్, కుర్చీ మాత్రమే కాదు. సహజమైన గాలి, వెలుతురు, మానసిక ప్రశాంతతను ఇచ్చేలా ఆఫీసులను డిజైన్ చేస్తున్నారు. సంప్రదాయ ఆఫీసుల కంటే ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ (workplace) లో పని చేసే వారి మానసిక ఆరోగ్యం 83 శాతం మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటేనే ఉద్యోగులు మెరుగ్గా పని చేస్తారని కంపెనీలు భావిస్తున్నాయి.
4. మీ పనిలో 'AI' ఒక కో-పైలట్!
వచ్చే ఏడాది నాటికి ప్రతి ఉద్యోగికి ఏఐ (AI) ఒక సహాయకుడిలా మారుతుంది. మీ మీటింగ్‌ల షెడ్యూలింగ్, మెయిల్స్ డ్రాఫ్టింగ్ వంటి రొటీన్ పనులను ఏఐ చూసుకుంటుంది. దీనివల్ల ఉద్యోగులు మరింత క్రియేటివ్ పనులపై దృష్టి పెట్టవచ్చు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఈ ఏఐ టూల్స్ వాడటంలో సీనియర్లకు మార్గదర్శకులుగా మారుతున్నారు.
5. పర్యావరణ పరిరక్షణ (ESG) తప్పనిసరి!
నెట్-జీరో లక్ష్యాలను చేరుకోవడానికి కంపెనీలు ఇప్పుడు కేవలం లాభాలనే కాదు, పర్యావరణాన్ని కూడా చూస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగించే భవనాలు, పర్యావరణానికి హాని చేయని ఆఫీసు సామాగ్రిని ఎంచుకోవడం 2026లో అనివార్యం కానుంది. పర్యావరణ స్పృహ ఉన్న కంపెనీలకే ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఓటు వేస్తున్నారు.
మొత్తానికి 2026లో మీ వర్క్ ప్లేస్ (workplace) అనేది కేవలం పని చేసే చోటు మాత్రమే కాదు.. అది మీ ఆరోగ్యం, టెక్నాలజీ , పర్యావరణం కలగలిసిన ఒక కొత్త ప్రపంచం కాబోతోంది. అలాగే పని చేసే ప్రదేశం కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా మారబోతోంది. ఇకపై మీ ఊరకి దగ్గర్లోనే మీ ఆఫీసులు ఉండే అవకాశం కనిపిస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications