బిగ్ ఫండ్స్ సీక్రెట్ లీక్: దేశంలోని 3 అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ నమ్ముకున్న ఆ 5 షేర్లు ఇవే!

భారతీయ స్టాక్ మార్కెట్ (stock market) లో ప్రస్తుతం స్మాల్‌క్యాప్ (Small-cap) షేర్ల హవా నడుస్తోంది. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 ఈ ఏడాది దాదాపు 8% పైగా పడిపోయినప్పటికీ.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ మాత్రం 4.3% లాభాలతో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్‌లో మార్కెట్ దిగ్గజాలైన ఫండ్ మేనేజర్లు ఎక్కడ డబ్బులు పెడుతున్నారనేది రిటైల్ ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యం. తాజా డేటా ప్రకారం, ఇండియాలోనే అత్యంత పెద్దవైన మూడు స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. ఒకే ఐదు కంపెనీలపై విపరీతమైన నమ్మకంతో భారీగా పెట్టుబడులు పెట్టాయి.

Top 5 Smallcap Stocks India Mutual Funds SBI HDFC Nippon Investment Stock Market News

రూ. 1.51 లక్షల కోట్ల పూల్‌లో ఆ 5 షేర్ల హవా!

దేశంలోనే అతిపెద్ద స్మాల్‌క్యాప్ స్కీమ్ అయిన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (రూ. 74,600 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ (రూ. 38,800 కోట్లు), , ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ (రూ. 37,400 కోట్లు) - ఈ మూడు ఫండ్స్ కలిసి మొత్తం రూ. 1.51 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్మును మేనేజ్ చేస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ మూడు దిగ్గజ ఫండ్స్ ఒకే ఐదు అండర్-ది-రాడార్ (పెద్దగా ప్రచారంలో లేని) స్టాక్స్‌లో ఏకంగా రూ. 8,000 కోట్లు (దాదాపు 5.34% ఆస్తులు) ఇన్వెస్ట్ చేశాయి. ఆ

ఐదు కంపెనీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  1. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS): ఈ హాస్పిటల్ చైన్ షేర్లపై ఫండ్ మేనేజర్లకు అత్యధిక నమ్మకం ఉంది. ఈ మూడు ఫండ్స్ కలిసి ఇందులో రూ. 2,170 కోట్ల విలువైన షేర్లను హోల్డ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ తన ఫండ్ లో 2.50% వాటాను దీనికే కేటాయించింది.
  2. కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ (Kalpataru Projects): ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా రంగంలోని ఈ కంపెనీలో మూడు ఫండ్స్ కలిపి రూ. 2,100 కోట్లు పెట్టాయి.
  3. సిటీ యూనియన్ బ్యాంక్ (City Union Bank): బ్యాంకింగ్ రంగం నుండి ఈ షేర్ మూడో స్థానంలో నిలిచింది. దీనిపై మొత్తం రూ. 1,777 కోట్ల ఎక్స్‌పోజర్ ఉంది.
  4. పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox): మల్టీప్లెక్స్ దిగ్గజం అయిన ఈ కంపెనీలో రూ. 1,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
  5. కార్బోరండమ్ యూనివర్సల్ (Carborundum Universal): ఇండస్ట్రియల్ సిరామిక్స్ తయారు చేసే ఈ సంస్థలో రూ. 990 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

ఎస్‌బీఐ ఫండ్ మోస్ట్ అగ్రెసివ్!

ఈ ఐదు స్టాక్స్‌పై ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్‌కు గట్టి నమ్మకం (Conviction) ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తన మొత్తం పోర్ట్‌ఫోలియోలో దాదాపు 10 శాతం వాటాను ఈ ఐదు షేర్లకే కేటాయించింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్ 6.64%, నిప్పాన్ ఫండ్ 2.49% చొప్పున కేటాయించాయి. గడిచిన 18 నెలల్లో జరిగిన మార్కెట్ కరెక్షన్ తర్వాత, ఈ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ కంపెనీల ఆదాయాలు (Earnings) 23% నుండి 36% వరకు బలంగా పెరగడమే ఫండ్ మేనేజర్లు వీటి వైపు మొగ్గు చూపడానికి కారణం.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ (stock market) లో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవమే. జేఎం ఫైనాన్షియల్ వంటి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు స్మాల్‌క్యాప్స్ ప్రస్తుతం కొంచెం కాస్ట్‌లీగా (Overvalued) ఉన్నాయని హెచ్చరిస్తున్నప్పటికీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇదొక మంచి అవకాశమని నిపుణులు చెప్తున్నారు. టాప్ ఫండ్ హౌసెస్ ఒకే రకమైన స్టాక్స్‌ను ఎంచుకున్నాయంటే.. బాటమ్-అప్ రీసెర్చ్ ప్రకారం ఆ కంపెనీల ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని అర్థం. కాబట్టి, మార్కెట్ పడిపోయిన ప్రతిసారీ ఇలాంటి క్వాలిటీ షేర్లను కొద్దికొద్దిగా కొనుగోలు చేయడం (Accumulate) మంచి స్ట్రాటజీ కావచ్చు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+