For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ 5 కారణాలతోనే లేఆఫ్‌లు.. నెమ్మదించిన టెక్ పరిశ్రమ.. వేగంగా ఉద్యోగుల తొలగింపులు..!

|

దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ ప్రపంచం ఆర్థిక అంధకారంలోకి జారుకుంటోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని పరిశ్రమలూ దీనికి ప్రభావితం అవుతున్నాయి. ప్రధానంగా విదేశీ ఆర్డర్లపై ఆధారపడే భారత టెక్ పరిశ్రమ మాత్రం తీవ్రంగా నష్టపోతోంది. దీనికి ప్రధానంగా 5 కారణాలు ప్రేరేపించాయి. పూర్తి వివరాలు..

వేలల్లో తొలగింపులు..

వేలల్లో తొలగింపులు..

చిన్న కంపెనీల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ శీతాకాలం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా టెక్ కంపెనీలు స్వల్పకాలంలో భారీ తొలగింపులను ఎంచుకున్నాయి. దీంతో అనేక మంది తమ కలల ఉద్యోగాలకు దూరమవుతున్నారు. మెటా, అమెజాన్, ట్విట్టర్, స్నాప్, మైక్రోసాఫ్ట్.. ఇలా వాల్ స్ట్రీట్ లోని అనేక కంపెనీలు ఇదే బాటను ఎంచుకున్నాయి.

సామూహిక తొలగింపులు..

సామూహిక తొలగింపులు..

అసలు సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఏకకాలంలో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి 5 విషయాలు ఆజ్యం పోశాయి. వాటి ప్రభావంతో ఖర్చుల మదింపు చర్యల్లో భాగంగా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టాప్-5 కారణాలు ఇవే..

కరోనా:

కరోనా:

కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నందున వారు ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడుపిన సమయంలో టెక్ ఆధారిత సేవలకు డిమాండ్ పెరిగింది. అప్పట్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకున్నాయి. అలా వినియోగం పెరిగి తాత్కాలికంగా డిమాండ్ పెరిగింది. ఆ సమయంలో కంపెనీలు మానవ వనరులు, టెక్నాలజీపై భారీగా ఇన్వెస్ట్ చేశాయి.

అధిక నియామకాలు: మహమ్మారి తర్వాత బూమ్ కొనసాగుతుందని చాలా టెక్ కంపెనీలు ఆశించాయి. ఆంక్షలు సడలించిన తర్వాత ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం ప్రారంభించడంతో డిమాండ్ పడిపోయింది. ఫలితంగా టెక్ కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయి. డిమాండ్‌లో ఆకస్మిక పెరుగుదల కారణంగా ఈ వనరుల్లో కొన్ని అధిక ధరకు అద్దెకు తీసుకోబడ్డాయి. దీనికి తోడు అధిక నియామకాలు కూడా జరిగాయి.

మాంద్యం భయాలు: కొవిడ్ పూర్వ స్థాయికి డిమాండ్ తిరిగి రావడం, పెరుగుతున్న రుణాలు, మాంద్యం భయాల కారణంగా ఈ కంపెనీలు పనికిరాని ప్రాజెక్ట్‌లను మూసివేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి అదనపు, అధిక ఖర్చులను పెట్టాయి. ఇప్పటికే ఉన్న వనరులను మూసివేయడం ద్వారా తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: మార్కెట్‌ను మరింత అస్థిరంగా మార్చిన కారణంగా యుద్ధం కూడా అనుకోకుండా ఈ తొలగింపులకు దోహదపడింది. రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతినటం వల్ల కూడా అనేక దేశాల్లో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.

ద్రవ్యోల్బణం: పెరుగుతున్న ద్రవ్యోల్బణం అనేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేసింది. జాబ్ మార్కెట్‌లో కూడా సంక్షోభానికి ఇది కారణమైంది. ఈ హెచ్చుతగ్గులన్నింటినీ అధిగమించడానికి ప్రపంచం ప్రస్తుతం రీసెట్ బటన్‌ను నొక్కటంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోవలస వస్తోంది. వీటికి అధిక వడ్డీ రేట్లు కూడా తోడుకావటం మరింత ఇబ్బందిని కలిగిస్తోంది.

Read more about: it jobs it news it business news
English summary

ఆ 5 కారణాలతోనే లేఆఫ్‌లు.. నెమ్మదించిన టెక్ పరిశ్రమ.. వేగంగా ఉద్యోగుల తొలగింపులు..! | top 5 reasons behind tech firings across world top companies

top 5 reasons behind tech firings across world top companies
Story first published: Tuesday, November 22, 2022, 10:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X