లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? అయితే మీరు మల్టీబ్యాగర్ స్టాక్స్(multibagger stocks) లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్ ఎలా ఉన్నా కొన్ని స్టాక్స్ మాత్రం దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడిని ఇస్తాయి. బ్రోకరేజ్ సంస్థలు సూచిస్తున్న కొన్ని బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మార్కెట్లో ప్రాఫిట్స్ లో ఉన్న కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో పెట్టుబడి పెడితే.. మార్కెట్ అంచనాల ప్రకారం నాలుగైదు ఏళ్లలో 15% నుంచి 44% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెమికల్స్, ఫార్మా, మెటల్స్, సిమెంట్ వంటి కీలక రంగాల్లో వృద్ధి ఆధారంగా ఈ స్టాక్స్‌ను బ్రోకరేజ్ సంస్థలకు ఎంపిక చేశాయి. ఓసారి లిస్ట్ చూస్తే..
1. హిందుస్థాన్ కాపర్ (Hindustan Copper)
ప్రస్తుత ధర రూ.312 వద్ద ఉండగా లాంగ్ టర్మ్ లో ఇది రూ.450 కు చేరుకుంటుందని అంచనా. మెటల్ రంగంలో అసాధారణ వృద్ధి అంచనాలు ఉండటంతో ఈ స్టాక్ ఏకంగా 44% అత్యధిక రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈ జాబితాలోనే అత్యంత భారీ అంచనా!
2. విష్ణు కెమికల్స్ (Vishnu Chemicals)
దీని ప్రస్తుత ధర రూ.502 ఉండగా.. లాంగ్ టర్మ్ లో రూ.650 టార్గెట్ అందుకోవచ్చని అంచనా. ప్రత్యేక రసాయనాల విభాగంలో బలంగా ఉన్న ఈ కంపెనీ షేర్లలో 29% పెరుగుదల ఉంటుందని బ్రోకరేజ్ సంస్థలు నమ్ముతున్నాయి.
3. స్టార్ సిమెంట్ (Star Cement)
ప్రస్తుత ధర రూ.224 ఉండగా లాంగ్ టర్మ్ లో రూ.280 లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఒక అంచనా. మౌలిక సదుపాయాల రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిమెంట్ షేర్ 25% వరకు లాభాలను నమోదు చేయవచ్చు.
4. దీపక్ నైట్రైట్ (Deepak Nitrite)
ప్రస్తుతం రూ.1,625 వద్ద ఉన్న ఈ షేర్ ధర ఫ్యూచర్ లో రూ.2,017 లక్ష్యాన్ని అందుకోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తుంది. మోర్గాన్ స్టాన్లీ ఈ కంపెనీపై 'ఓవర్‌వెయిట్' వైఖరిని కొనసాగిస్తోంది. ఈ కెమికల్ దిగ్గజం 24% వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తుంది.
5. లుపిన్ (Lupin)
ప్రస్తుత ధర రూ.1,998 ఉండగా.. లాంగ్ టర్మ్ లో రూ.2,300 టార్గెట్ అందుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఫార్మా రంగంలో బలమైన ప్లేయర్ అయిన లుపిన్ రాబోయే రోజుల్లో 15% లాభాలు ఇవ్వవచ్చని బ్రోకరేజ్ సంస్థలు విశ్వసిస్తున్నాయి.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications