Large Cap Funds: మారుతున్న కాలానికి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. అందుబాటులో ఉన్న ఇతర ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలతో పోలిస్తే వీటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రిటర్న్స్ కూడా భారీగా ఉండటంతో పెట్టుబడుదారులు అటువైపు దిష్టి సాధిస్తున్నారు. పలు మ్యూచువల్ ఫండ్స్ గత ఐదేళ్లలో సృష్టించిన సంపద చూస్తే ఎందుకు అందరూ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆరాటపడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది.
మ్యూచువల్ ఫండ్లలో ప్రధానంగా ఉండే లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్స్‌లో కాలానుగుణంగా పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే స్మాల్ క్యాప్ బేస్డ్ ఫండ్స్‌లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుండగా.. రిటర్న్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే సేఫ్ ప్లేయర్స్‌కి మాత్రం లార్జ్ క్యాప్ ఫండ్స్ తిరుగులేనివని చెప్పాలి. ఎందుకంటే వాటికి స్థిరత్వం ఎక్కువ. మార్కెట్లలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని మంచి రిటర్న్స్ ఇచ్చే సత్తా వాటికుంది.

గత 10 ఏళ్లలో టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ 20 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. వాటిలో క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ ముందు వరుసలో ఉంది. 20 శాతానికి పైగా ఇన్వెస్టర్ల సంపదను వృద్ధి చెందించింది. సంవత్సర ప్రాతిపదికన ఏకంగా 550 శాతానికి పైగా బాహుబలి రిటర్న్స్‌తో మతి పోగొట్టింది. ఇక తర్వాత స్థానంలో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ నిలిచింది. ఇది 17 శాతం సంపద వృద్ధితో పాటు 382 శాతం అబ్సల్యూట్ రిటర్న్స్ డెలివరీ చేసింది.
అదే కంపెనీకి చెందిన మరో ఫండ్ నిప్పాన్ ఇండియా ETF నిఫ్టీ నెక్స్ట్ 50 బీస్ కూడా 17 శాతం రిటర్న్స్ జనరేట్ చేసింది. తదనంతర స్థానంలో ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 సైతం దాదా పు 17 శాతాన్ని చేతిలో పెట్టింది. ఇక చివరిగా LIC MF నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ దాదాపు అదే స్థాయి రిటర్న్స్ ఇచ్చింది. 350 శాతానికి పైగా అబ్సల్యూట్ రిటర్న్స్‌తో ఈ రెండు ఫండ్స్ అదరగొట్టాయి.


Click it and Unblock the Notifications