IPO: మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ప్రజలు ఇన్వెస్ట్‌మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత రిస్క్ ఎక్కువగా ఉన్న అధిక రిటర్న్స్ వస్తుండటంతో, ఈక్విటీస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన IPOలు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడమే ఇందుకు నిదర్శనం. 2023లో IPOకి రానున్న టాప్ 5 కంపెనీలు ఇవే..
ఈ ఏడాది మార్కెట్లోకి రానున్న IPOల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది టాటా టెక్నాలజీస్. ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ సర్వీసెస్‌ను ఈ సంస్థ అందిస్తోంది. టాటా గ్రూపు నుంచి దాదాపు 19 ఏళ్ల తర్వాత వస్తున్న IPO ఇది కావడం విశేషం. దీనికి సంబంధించి సైజ్ వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.

పాపులర్ పేమెంట్స్ ప్లాట్‌ఫారం మొబిక్విక్ ఈ ఏడాది మార్కెట్లో అరంగేంట్రం చేయనుంది. మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ సహా అనేక రకాల సేవలను అందిస్తోంది. 1,900 కోట్ల ఇష్యూ సైజ్‌తో రానుంది. సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధితో పాటు ప్రొడక్ట్ ఆఫర్‌లను విస్తరించడం సహా మార్కెట్ వాటాను పెంచుకోవడానికి వినియోగించనున్నట్లు ప్రకటించింది
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఈ ఏడాది IPO విడుదల కానుంది. పోర్ట్ ల్యాండ్ పోజోలానా సిమెంట్ (PPC), ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ (OPC), పోర్ట్ ల్యాండ్ స్లాగ్ సిమెంట్ (PSC) సహా పలు సిమెంట్ ప్రొడక్టులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. రూ.1,550 కోట్లు సమీకరించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఫిన్‌కేర్ బ్యాంకు సైతం IPOకు సిద్ధమైంది. సేవింగ్స్ అకౌంట్స్, లోన్‌లు, మైక్రోఫైనాన్స్ సర్వీసుల సహా పలు రకాల బ్యాంకింగ్ ప్రొడక్టులు, సర్వీసులు అందిస్తోంది. 625 కోట్ల నిధులు సమీకరించే యోచనలో సంస్థ ఉంది.
న్యూట్రిషన్ ఇండస్ట్రీలో హెక్సాగాన్ న్యూట్రిషన్ అగ్రగామిగా ఎదిగింది. 600 కోట్లు సేకరించడమే లక్ష్యంగా IPOతో ముందుకు రానుంది. 2021 డిసెంబరులోనే ఇందుకోసం SEBI వద్ద DRHP డ్రాఫ్ట్‌ను ఫైల్ చేసింది. కంపెనీ డెవలప్‌మెంట్, రుణాలు తీర్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications