2025లో బంగారం ధరల గురించే అందరూ మాట్లాడుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో వెండి సర్ ప్రైజ్ ఇచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపిస్తూ, ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర దాదాపు రూ. 2,44,000 కు చేరుకుంది. ప్రస్తుతానికి ఇదే ఆల్ టైం హయ్యెస్ట్ రేటు. త్వరలోనే ధర రూ.3 లక్షల మార్క్ దాటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వెండి ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది? ఏ దేశాలు వెండి మార్కెట్‌ను శాసిస్తున్నాయి? ఆ టాప్-5 దేశాల వివరాలు మీకు తెలుసా?
1. పెరూ (Peru) - ప్రపంచ వెండి రారాజు
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశంగా పెరూ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సుమారు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా హువారీ ప్రాంతంలోని 'ఎంటామినా' గని పెరూను గ్లోబల్ మార్కెట్‌లో నంబర్ వన్‌గా నిలబెడుతోంది. వెండి సామ్రాజ్యానికి పెరూను నిజమైన రాజుగా అభివర్ణించవచ్చు.
2. రష్యా (Russia) - రెండో స్థానంలో గట్టి పోటీ
రష్యా సుమారు 92,000 టన్నుల వెండి నిల్వలతో రెండో స్థానంలో ఉంది. సైబీరియా, ఉరల్ ప్రాంతాల్లోని గనులు రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ, గ్లోబల్ సిల్వర్ మార్కెట్‌లో రష్యా కీలక పాత్ర పోషిస్తోంది.

3. చైనా (China) - మూడో స్థానంలో డ్రాగన్
సుమారు 70,000 మెట్రిక్ టన్నుల వెండితో చైనా మూడో స్థానంలో ఉంది. హెనాన్ ప్రాంతంలోని 'యింగ్' గని చైనాకు ప్రధాన ఆదాయ వనరు. గత కొన్నేళ్లుగా ఖనిజాల ఉత్పత్తిలో చైనా వేగంగా అభివృద్ధి చెందుతూ.. వెండి మార్కెట్‌లో తన పట్టును పెంచుకుంటోంది.
4. పోలాండ్ (Poland) - మెరుస్తున్న యూరప్ దేశం
పోలాండ్ దాదాపు 61,000 టన్నుల వెండి నిల్వలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన KGHM ఇక్కడ వెండి, రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. 2024 నుంచి గొగోవ్ కాపర్ స్మెల్టర్ ద్వారా వెండిని శుద్ధి చేస్తూ.. పోలాండ్ తన మార్కెట్ వాటాను పెంచుకుంటోంది.
5. మెక్సికో (Mexico) - వెండి గనుల నిలయం
సుమారు 37,000 టన్నుల వెండి నిల్వలతో మెక్సికో ఐదో స్థానంలో ఉంది. జకాటెకాస్‌లోని 'న్యూమాంట్ పెనాస్క్విటో' గని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వెండి గనిగా గుర్తింపు పొందింది. ఉత్పత్తి పరంగా మెక్సికో ఇప్పటికీ ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తోంది.
భారతదేశం పరిస్థితి ఏంటి?
వెండిని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. మన దేశంలో వెండికి ఉన్న సాంస్కృతిక, పారిశ్రామిక ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే నిల్వల విషయానికి వస్తే భారత్ టాప్-5 లో లేదు. మన దేశంలో వెండి నిల్వలు పరిమితంగా ఉండటంతో.. అవసరాల కోసం విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటాం. అందుకే గ్లోబల్ మార్కెట్‌లో భారత్ ఒక ప్రధాన 'కొనుగోలుదారు' (Buyer), ఇన్వెస్టర్‌గా కీలక పాత్ర పోషిస్తోంది.
పెట్టుబడిగా వెండి సరైనదేనా?
ప్రస్తుత పరిస్థితుల్లో వెండి ధరలు చూస్తుంటే.. బంగారానికి ధీటుగా రాబడులు ఇచ్చేలా ఉంది. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, సోలార్ ఇండస్ట్రీలో వెండి వినియోగం పెరుగుతుండటంతో, భవిష్యత్తులో కూడా దీని ధరలకు తిరుగుండదని నిపుణులు భావిస్తున్నారు. మీరు కూడా తక్కువ మొత్తంలో పెట్టుబడి మొదలుపెట్టాలనుకుంటే వెండి ఒక మంచి ఆప్షన్ కావచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications