ప్రస్తుతం ఎన్నో క్రిప్టోకరెన్సీలు అందుబాటులో ఉన్నాయి. కరోనా కాలంలో పలు క్రిప్టో కరెన్సీలు భారీగా పెరిగాయి. బిట్ కాయిన్ వంటి క్రిప్టోలు ఏకంగా 65,000 డాలర్లకు చేరుకొని, ఆ తర్వాత 30,000 దిగువకు కూడా పతనమైంది. తిరిగి కోలుకొని, 50,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోలు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ, కరోనా సమయంలోనే ధరలు ఆకాశాన్ని తాకాయి. కొత్త తరం ఇంటర్నెట్ ఔత్సాహికులు, పెద్ద మొత్తంలో ఫైనాన్స్ పట్ల అప్రమత్తత, ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయబడిన డిజిటల్ నెట్ వర్క్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం వంటి వివిధ కారణాలతో క్రిప్టో ఉత్పత్తులు, సేవల అభివృద్ధి పెరిగింది.
మార్కెటింగ్ కోసం వీటిపై దృష్టి సారించారు. మార్కెటింగ్ కోసం తమ సమయం, వనరుల కేటాయింపు పెరగడంతో క్రిప్టో కరెన్సీలు కూడా ధరలు పెంచాయి. క్రిప్టో కరెన్సీ ఓ డిజిటల్ మనీ. దీనిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకుల వంటి రెగ్యులేటర్ లేదు. అలాగే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బిట్ కాయిన్ విస్తృతంగా ఉపయోగిస్తున్న క్రిప్టో.

రికార్డ్ స్థాయి నుండి పతనం.. మళ్లీ జంప్
బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టో కరెన్సీలను ఇన్వెస్టర్లు స్వల్పకాలిక పెట్టుబడిగా మాత్రమే చూడటం లేదు. చాలామంది దీర్ఘకాలానికి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే మీ డబ్బును ఎందులో పెట్టాలి అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి కోసం ఇటీవలి కాలంలో నిలకడగా, అగ్రస్థానంలో ఉన్న క్రిప్టో జాబితా చూడవచ్చు. ఫండ్, స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.
అలాగే క్రిప్టో పెట్టుబడి కూడా రిస్క్ కలిగిన సాధనమే. కాబట్టి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. కింద పేర్కొన్న క్రిప్టోలు ఇటీవల మంచి ప్రదర్శన కబరిచినవి లేదా దీర్ఘకాలంలో ముందు స్థానంలో ఉన్నవి. అంతేకానీ వీటిలో ఇన్వెస్ట్ చేయాలని సజెస్ట్ చేయడం కాదు.
ఉదాహరణకు కరోనాకు ముందు 5వేల డాలర్ల వద్ద ఉన్న బిట్ కాయిన్ ఇటీవల 65,000 డాలర్లకు చేరుకొని, అంతలోనే 30వేల డాలర్ల దిగువకు పతనమైంది. ఇప్పుడు 50వేల డాలర్ల సమీపంలో ఉంది. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నది. అందుకే అన్నీ పరిశీలించి, అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.

బిట్ కాయిన్
ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్. దీనిని డిజిటల్ బంగారంగా పేర్కొంటున్నారు. ఇతర ఏ క్రిప్టోకరెన్సీకి లేనట్లుగా బిట్ కాయిన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. బిట్ కాయిన్ ధర, మార్కెట్ వ్యాల్యూ, వ్యాల్యూమ్.. అన్ని ఇతర క్రిప్టోల కంటే ఎక్కువే. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది క్రిప్టోలు ఉన్నాయి.
అయితే క్రిప్టోల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 శాతం కంటే ఎక్కువగా ఉంది. బిట్ కాయిన్ ధర పెరిగినప్పటికీ లేదా తగ్గినప్పటికీ దీంతో సంబంధం లేకుండా క్రిప్టో మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్ అస్థిరతతో సంబంధం లేకుండా వ్యాపారులు బలమైన లిక్విడిటీ ఉన్నంత వరకు లాభపడతారు.

ఎథేరియం
క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ తర్వాత ఆధిపత్యం ఎథేరియందే. తమ డెవలపర్లు తమ సొంత క్రిప్టోను సృష్టించేందుకు ఎథేరియం నెట్ వర్క్‌ను ఉపయోగించడానికి అనుమతించే నెట్ వర్క్ ఇది. వ్యాల్యూపరంగా బిట్ కాయిన్ కంటే చాలా వెనుకబడి ఉన్నప్పటికీ ఇతర ప్రత్యర్థి క్రిప్టోల కంటే చాలా ముందు ఉంది. బిట్ కాయిన్ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2021లో బిట్ కాయిన్ కంటే ఎథేరియం ఎక్కువగా లాభపడింది.

బియాన్స్ కాయిన్
టాప్ 10 క్రిప్టో కరెన్సీలో బియాన్స్ కాయిన్ ఉంది. 2017లో అత్యధిక స్థాయిని అధిగమించిన క్రిప్టోల్లో ఇది కూడా ఒకటి. ఇతర క్రిప్టోల వలె ఇది కూడా భారీగానే లాభపడింది. మరో క్రిప్టో కరెన్సీ కార్డానో 1600 శాతం పెరిగింది. మరో క్రిప్టో యూనిస్వాప్ 800 శాతం పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications