MidCap Mutual Funds: దేశీయంగా మ్యూచువల్ ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో చిన్న మెుత్తంలో అయినా దీర్ఘకాలం పాటు దాటుకుంటే డబ్బులు అనేక రెట్లు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గత పనితీరు సైతం ఇదే రుజువు చేస్తోంది. ప్రస్తుతం వేలల్లో దాచుకున్న వ్యక్తులు ఎలా కోట్లు సంపాదించారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ తమ నెలవారీ సిప్ పెట్టుబడులతో దీర్ఘకాలం పాటు పెద్ద కార్పస్‌గా మార్చే పథకాల కోసం చూస్తారు. ఈ క్రమంలో గడచిన 25 ఏళ్లలో దాదాపు నాలుగు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రాబడులను అందించటంలో తమ సత్తా చాటుకున్నాయి. ఈ ఫండ్స్ ప్రతి నెల రూ.10 వేలు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ కొనసాగించిన కోట్లలో రాబడిని తెచ్చిపెట్టాయి. అయితే మిడ్‌క్యాప్ స్కీమ్‌లు సాధారణంగా అధిక-రిస్క్ టాలరెన్స్, 7-10 ఏళ్ల వరకు ఎక్కువ పెట్టుబడి హోరిజోన్ కలిగి ఉంటాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

- నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ గత 25 ఏళ్లలో రూ.10,000 నెలవారీ సిప్ పెట్టుబడి కొనసాగించిన వ్యక్తులకు రూ.9.91 కోట్ల రాబడిని అందించింది. ఈ కాలంలో స్కీమ్ 22.84 శాతం XIRR రాబడిని అందించింది.
- ఇక రాబడి విషయంలో రెండో స్థానంలో నిలిచిన ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ అదే కాలంలో 21.18% XIRR రాబడిని తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో నెలకు 10 వేలు సిప్ పెట్టుబడిని ఫండ్ లో కొనసాగించిన వ్యక్తులు ప్రస్తుతం రూ.7.54 కోట్లను మార్కెట్ విలువ ప్రకారం పొందుతారు.
- మూడో స్థానంలో నిలిచిన టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ పేర్కొన్న కాలంలో 19.40% XIRRతో రూ.10,000 నెలవారీ సిప్ పెట్టుబడి విలువను ప్రస్తుతం రూ.5.62 కోట్లకు మార్చింది.
- ఇక చివరిగా మంచి రాబడులను తెచ్చిపెట్టిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో టారస్ మిడ్ క్యాప్ ఫండ్ చోటు దక్కించుకుంది. నెలవారీ రూ.10 వేలు సిప్ చేసిన వ్యక్తులు 25 ఏళ్ల కాలంలో రూ.2.82 కోట్లను రాబడిగా అందుకున్నారు.పైన గత 25 ఏళ్లలో ఏ మిడ్ క్యాప్ ఫండ్స్ రూ.10,000 నెలవారీ SIPని రూ.2.50 కోట్లకు మించాయి అనే దానిపై జరిగిన రీసెర్చ్ ప్రకారం పైన పేర్కొన్న ఫండ్స్ మంచి పనితీరును కనబరిచినట్లు వెల్లడైంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications