Investment Tips: ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ గందరగోళాల్లో చాలా మంది పెట్టుబడిదారులు సరైన షేర్ల కోసం వెతుకున్నారు. ఈ క్రమంలో మూడు కంపెనీల షేర్లు పెట్టుబడికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి
GPPL stock:
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జీపీపీఎల్ కంపెనీ షేర్ల గురించే. టెక్నికల్ గా స్టాక్ ప్రస్తుతం బులిష్ మెుమెంటం కలిగి ఉంది. ప్రస్తుతం 20 రోజుల మూవింగ్ యావరేజ్‌కి పైన స్టాక్ ట్రేడవుతోంది. అలాగే ఆర్ఎస్ఐ కూడా సానుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఈ కంపెనీ షేర్లను రూ.160-163 స్థాయి వద్ద కొనుగోలు చేసేందుకు వీలుండగా టార్గెట్ ధర గరిష్ఠంగా రూ.175గా పరిగణించొచ్చు. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు రూ.154 రేటును స్టాప్ లాస్ రేటుగా పరిగణించాలి.

PNC Infra:
ప్రస్తుతం పీఎన్సీ ఇన్ ఫ్రా కంపెనీ షేర్లు భారీగా బులిష్ మెుమెంటం కలిగి ఉన్నాయి. టెక్నికల్ ఇండికేటర్లు సైతం ఇదే విషయాన్ని నిర్థారించాయి. ప్రస్తుతం స్టాక్ ధర రూ.400-410 మధ్య మార్కెట్లో కొనసాగుతోంది. రానున్న కాలంలో షేర్లు టార్గెట్ ధర రూ.460-500గా పరిగణించొచ్చని నిపుణులు చెబుతుండగా ఇందుకోసం వారు స్టాప్ లాస్ ధరను రూ.370గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
WestCoastPaper:
ఇప్పుడు చివరిగా మనం మాట్లాడుకోబోతున్నది వెస్ట్ కోస్ట్ పేపర్ కంపెనీ షేర్ల గురించే. ప్రస్తుతం రూ.695-750 మధ్య రేటులో కన్సాలిడేట్ అయిన కంపెనీ షేర్లు బ్రేకవుట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెక్నికల్స్ సూచిస్తున్నాయి. ప్రస్తుతం స్టాక్ ధర రూ.720-730 మధ్య కొనసాగుతుండగా.. రానున్న కాలంలో స్టాక్ రేటు రూ.775-800 స్థాయిని చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో స్టాప్ లాస్ రేటును రూ.695గా ఉంచుకోవాలని వారు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.
NOTE: పైన పేర్కొన్న షేర్ల వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలను తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు నష్టాలతో కూడుకున్నందున ఇన్వెస్టర్లు పెట్టుబడికి ముందు మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications