పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు నమ్ముకున్న ఆ 3 ఫండ్స్ ఇవే.. తక్కువ ధరకే కొనేందుకు సూపర్ ఛాన్స్!

ప్రస్తుతం భారత షేర్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి రుతుపవనాలు (Monsoon) బలహీనంగా ఉంటాయనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.

అయితే, మార్కెట్ ఇలా పడిపోవడాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో 'వాల్యూ ఇన్వెస్టింగ్' (Value Investing) రూట్ ఎంచుకుంటే మంచి లాభాలు వస్తాయి. వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ (Value mutual funds) అనేవి మంచి ఫండమెంటల్స్ ఉండి, ప్రస్తుతం మార్కెట్ నష్టాల వల్ల తక్కువ ధరకే దొరికే స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. మార్కెట్ మళ్లీ పుంజుకున్నప్పుడు ఈ ఫండ్స్ భారీ రిటర్న్స్ ఇస్తాయి. గత 5 ఏళ్లలో అత్యుత్తమ రిటర్న్స్ ఇచ్చిన టాప్ 3 వాల్యూ ఫండ్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Top 3 High Return Value Mutual Funds In Last 5 Years Stock Market Correction

1. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ (ICICI Pru Value Fund)

ఈ కేటగిరీలోనే అత్యంత పెద్ద ఫండ్ ఇది. అనవసరమైన హైప్ ఉన్న షేర్ల జోలికి వెళ్లకుండా, కేవలం లార్జ్-క్యాప్ (భారీ కంపెనీల) స్టాక్స్‌పైనే ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దీనివల్ల ఇన్వెస్టర్లకు రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. కాంట్రారియన్ ఇన్వెస్టింగ్ స్టైల్‌లో దిట్ట అయిన ప్రముఖ ఫండ్ మేనేజర్ శంకరన్ నరేన్ దీనిని పర్యవేక్షిస్తున్నారు.

  • గత 5 ఏళ్ల రిటర్న్స్: ఈ ఫండ్ గత ఐదేళ్లలో ఏకంగా 24.2% CAGR రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో నిఫ్టీ 500 ఇండెక్స్ కేవలం 18.1% మాత్రమే ఇచ్చింది.
  • టాప్ హోల్డింగ్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ , రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి టాప్ 63 కంపెనీల్లో దీనికి పెట్టుబడులు ఉన్నాయి.

2. హెచ్ఎస్బీసీ వాల్యూ ఫండ్ (HSBC Value Fund)

గతంలో దీనిని ఎల్ అండ్ టీ (L&T) వాల్యూ ఫండ్ అని పిలిచేవారు. వాల్యూ , గ్రోత్ ఇన్వెస్టింగ్ రెండింటినీ బ్లెండ్ చేస్తూ క్వాలిటీ బిజినెస్‌లలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. 2014 నుండి వేణుగోపాల్ మంగత్ గారు ఈ ఫండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు.

  • గత 5 ఏళ్ల రిటర్న్స్: ఈ ఫండ్ గత ఐదేళ్లలో గరిష్టంగా 24.7% CAGR రిటర్న్స్ ఇచ్చి బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. అయితే కేటగిరీ యావరేజ్ కంటే ఇందులో వోలటాలిటీ (రిస్క్) కాస్త ఎక్కువే ఉంటుంది.
  • పోర్ట్‌ఫోలియో: ఇందులో దాదాపు 81 స్టాక్స్ ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, రిలయన్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్ల వాటా 50-55% వరకు ఉంది.

3. హెచ్‌డీఎఫ్‌సీ వాల్యూ ఫండ్ (HDFC Value Fund)

1994లో ప్రారంభమైన ఈ పాత ఫండ్ మల్టీ-క్యాప్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. అంటే తక్కువ పీఈ (Price to Earnings) రేషియో ఉండి, తక్కువ ధరకు లభించే బలమైన కంపెనీలను ఎంచుకుని కనీసం 60% పెట్టుబడులు అందులోనే పెడుతుంది.

  • గత 5 ఏళ్ల రిటర్న్స్: గత ఐదేళ్లలో ఈ ఫండ్ 21.2% CAGR చొప్పున రిటర్న్స్ ఇచ్చింది.
  • పోర్ట్‌ఫోలియో: దీని పోర్ట్‌ఫోలియోలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ , భారతీ ఎయిర్‌టెల్ వంటి 71 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో లార్జ్ క్యాప్ వాటా 62.5% గా ఉంది.

వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ (Value mutual funds) అనేవి ఆర్థికంగా బలంగా ఉండి, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల వల్ల తక్కువ రేటుకు దొరికే స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి కాబట్టి.. వీటిలో మీ పెట్టుబడికి సేఫ్టీ (Margin of Safety) ఎక్కువగా ఉంటుంది. అయితే, మార్కెట్ కేవలం కొన్ని షేర్ల మోమెంటం ఆధారంగా పెరిగేటప్పుడు.. స్వల్పకాలంలో ఈ ఫండ్స్ కొంచెం తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. కానీ, 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ఇవి తిరుగులేని లాభాలను అందిస్తాయి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+