ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. లాక్ డౌన్ తర్వాత కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలు తీసుకు వస్తామన్నారు. బ్లాక్ లెవల్లో పబ్లిక్ లెవల్ హెల్త్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

పీఎం-ఈవిద్య ప్రోగ్రాం
స్వయంప్రభ ద్వారా ఆన్ లైన్ పాఠాలు నిర్వహిస్తున్నామని, గ్రామీణ విద్యార్థుల కోసం మరో 12 ఛానల్స్ ప్రారంభిస్తామని నిర్మల చెప్పారు. PM eVIDYa programme కింద డిజిటల్/ఆన్‌లైన్ బోధన ఉంటుందన్నారు. ఇప్పటికే ఉన్న 3 స్వయంప్రభ చానళ్లకు ఇవి అదనం అన్నారు. విద్యా ప్రసారాల కోసం 4 గంటలు ఎయిర్ టైమ్ కేటాయించామన్నారు.
విద్యారంగంలో ఆన్ లైన్‌ను ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య పరస్పర సంభాషణలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పరస్పర సంభాషణకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. బధిర విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక ఛానల్ అన్నారు. 100 టాప్ యూనివర్సిటీలకు ఆటోమేటిక్‌గా ఆన్ లైన్ కోర్సులు 30 మే 2020 నుండి నుండి ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల కోసం కరిక్యులమ్, ఆన్ లైన్ కరిక్యులమ్ సౌకర్యాలు ఉంటాయన్నారు. కమ్యూనిటీ రేడియోలు, బ్రాడ్ కాస్టింగ్ ద్వారా విద్యార్థులకు పాఠాలు నిర్వహిస్తామన్నారు. ఈ-పాఠశాలకు 200 కొత్త టెక్స్ట్ బుక్స్ యాడ్ చేస్తున్నట్లు చెప్పారు.

టెస్టింగ్ ల్యాబ్స్, కిట్స్ కోసం రూ.550 కోట్లు
టెస్టింగ్ ల్యాబ్స్, పరీక్షల కిట్స్ కోసం రూ.550 కోట్లు కేటాయించామన్నారు. పీపీఈ కిట్స్ విషయంలో 2 నెలలకు సరిపడా స్వయం సమృద్ధి సాధించామన్నారు. టెస్ట్ కిట్స్ తదితరాల అన్నింటి కోసం రూ.3750 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రాలకు 87 లక్షల ఎన్-95 మాస్కులను సరఫరా చేసినట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ-ప్రయివేటు రంగం సహకారంతో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. కరోనా సమయంలో 300కు పైగా పీపీఈ కిట్స్ తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. ఆరోగ్య రంగంలో పని చేసే సిబ్బందికి రూ.50 లక్షల చొప్పున బీమా ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు 51 లక్షల పీపీఈ కిట్స్ సరఫరా చేసినట్లు చెప్పారు. మండలస్థాయిలో ప్రజారోగ్య ప్రయోగ శాలల ఏర్పాటు ఉంటుందన్నారు. వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ద్వారా అదనపు నిధులు ఏర్పాటు చేస్తామన్నారు.

సంక్షోభాలు ఎదుర్కొనేలా చర్యలు
సొంతూళ్లకు వెళ్లే కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం కేర్స్‌కు ఇచ్చిన విరాళాలను కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకు చేర్చినట్లు చెప్పారు. ప్రజలను భయాందోళనల నుండి దూరం చేసేందుకు సైకలాజికల్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు, కుటుంబాలకు సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో సంక్షోభాలను భవిష్యత్తులో ఎదుర్కొనేందుకు భారీగా నిధులు సిద్ధం చేస్తామన్నారు.


Click it and Unblock the Notifications