మార్కెట్ పడినా తగ్గని డిమాండ్.. భారీ లాభాలనిచ్చే 10 సూపర్ స్టాక్స్ ఇవే!

గడిచిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ (stock market) తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. నిఫ్టీ 50 దాదాపు 0.96 శాతం, సెన్సెక్స్ 0.83 శాతం మేర నష్టపోయాయి. మార్కెట్ ఇలా నష్టాల్లో ఉన్నప్పటికీ, షేర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఇదొక మంచి అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.

నోమురా, జెఫరీస్, సిటీ, మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ రీసెర్చ్ సంస్థలు ఈ వారంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టే 10 కీలక స్టాక్స్‌ను 'బై' (Buy) రేటింగ్‌తో రికమండ్ చేశాయి. ఈ షేర్లు భవిష్యత్తులో 19% నుండి 41% వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఆ టాప్-10 స్టాక్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Top 10 Stocks To Buy This Week Brokers Project 41 Percent Return Stock Market

1. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ బ్యాంకింగ్ దిగ్గజంపై చాలా పాజిటివ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర కాస్త నెమ్మదించినా, బ్యాంక్ ఆపరేషనల్ బలం చాలా బాగుందని పేర్కొంది. ఈ షేర్‌కు రూ. 1,750 టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేసింది. అంటే ప్రస్తుత ధరపై ఏకంగా 41% లాభం వచ్చే ఛాన్స్ ఉంది.

2. టైటాన్ (Titan)

టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ రాబోయే నాలుగేళ్లలో తన జ్యువెలరీ బిజినెస్‌ను భారీగా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌కు రూ. 5,250 టార్గెట్ ఇచ్చింది. దీని ప్రకారం ఇన్వెస్టర్లకు 23.8% వరకు రిటర్న్స్ రావచ్చు.

3. పూనావాలా ఫిన్‌కార్ప్ (Poonawalla Fincorp)

కొత్త లీడర్‌షిప్, బలమైన అండర్‌రైటింగ్ ప్రమాణాల వల్ల ఈ ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) కొత్త గ్రోత్ ఫేజ్‌లోకి అడుగుపెడుతోందని జెఫరీస్ సంస్థ తెలిపింది. ఈ స్టాక్‌కు రూ. 490 టార్గెట్‌తో బై రేటింగ్ ఇచ్చింది. ఇది దాదాపు 23% లాభాన్ని సూచిస్తోంది.

4. హిటాచీ ఎనర్జీ (Hitachi Energy)

హై-వోల్టేజ్ ఎక్విప్‌మెంట్ మార్కెట్లో లీడర్‌గా ఉన్న ఈ కంపెనీపై సిటీ (Citi) బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది. రాబోయే పవర్ ప్రాజెక్టుల వల్ల ఈ కంపెనీకి భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని చెప్తూ రూ. 46,700 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ఇది 29% వరకు పెరిగే అవకాశం ఉంది.

5. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ (CG Power)

భారతదేశంలో రాబోయే డేటా సెంటర్ల నిర్మాణం వల్ల ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు డిమాండ్ భారీగా పెరగనుంది. నోమురా (Nomura) ఈ కంపెనీ షేర్‌కు రూ. 1,050 టార్గెట్ ఇచ్చింది. ఇది ఇన్వెస్టర్లకు 19.4% రిటర్న్స్ ఇవ్వగలదు.

6. టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ (Titagarh Rail Systems)

నూవామా (Nuvama) సంస్థ ఈ రైల్వే స్టాక్‌కు బై రేటింగ్ ఇస్తూ రూ. 1,089 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. పెద్ద పెద్ద రైల్వే, మెట్రో ప్రాజెక్టుల వల్ల లాంగ్ టర్మ్‌లో ఈ కంపెనీకి తిరుగుండదని, ప్రస్తుతం ఇది 36% పెరిగే చాన్స్ ఉందని పేర్కొంది.

7. శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance)

జపాన్‌కు చెందిన ఆర్థిక దిగ్గజం 'ముసిబిషి యూఎఫ్‌జే' (MUFG) తో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్. మోతీలాల్ ఓస్వాల్ ఈ షేర్‌కు రూ. 1,175 టార్గెట్ ఇచ్చింది. దీనివల్ల 29% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

8. గుజరాత్ గ్యాస్ (Gujarat Gas)

నోమురా సంస్థ ఈ గ్యాస్ కంపెనీ టార్గెట్ ప్రైస్‌ను రూ. 390 నుండి రూ. 511 కి పెంచింది. ఇండస్ట్రియల్ వాల్యూమ్స్ పెరగడం వల్ల ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

9. పతంజలి ఫుడ్స్ (Patanjali Foods)

జెఫరీస్ సంస్థ పతంజలి ఫుడ్స్‌కు బై రేటింగ్ కొనసాగిస్తూ రూ. 560 టార్గెట్ ఇచ్చింది. మార్చి త్రైమాసికంలో ఫలితాలు కొంచెం తగ్గినప్పటికీ, భవిష్యత్తులో వంట నూనెల మార్జిన్లు పెరిగి 23% వరకు లాభాలు ఇస్తుందని నమ్ముతోంది.

10. ఎమ్వీ ఫోటోవోల్టాయిక్ పవర్ (Emmvee Photovoltaic Power)

జేఎమ్ ఫైనాన్షియల్ (JM Financial) ఈ రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగించింది. ఈ షేర్‌కు రూ. 377 టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే 24% పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అంశాలు సంబంధిత వ్యక్తుల లేదా విశ్లేషకుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇవి " Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited " అధికారిక సలహాలు కావు. ఇందులో సమాచారం యొక్క ఖచ్చితత్వానికి మేము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వము. మేము స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలు లేదా కొనుగోలు/అమ్మకాల సిఫార్సులు చేయము. ఈ కథనాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించినవి. కాబట్టి, మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+