Stock Tips: దలాల్ స్ట్రీట్‌కు చెందిన బుల్స్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 21,000 మార్కును అందుకుంది. అయితే ఈ స్థాయిలో ట్రేడింగ్ కొనసాగించటం విఫలమైన కారణంగా కన్సాలిడేషన్ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. కన్సాలిడేషన్ దశ ఇండెక్స్ ఉన్నంత వరకు ఉంటుంది 21,000 మార్కు కంటే దిగువన ట్రేడవుతోందంటున్నారు.
ఈ క్రమంలో ముందుగా HDFC సెక్యూరిటీస్‌లో సీనియర్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్ సుబాష్ గంగాధరన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనికి రూ.2,000 టార్గెట్ ధరగా ఇస్తూ రూ.1,750 స్టాప్ లాస్ కింద పరిగణించాలని సూచించారు. అలాగే ఈఐ హోటల్ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.265గా ప్రకటించారు. అలాగే ఇన్వెస్టర్లు రూ.237ను స్టాప్ లాస్ కింద పరిగణించాలన్నారు.ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.105 టార్గెట్ ధరగా ప్రకటించారు. దీనికోసం ఇన్వెస్టర్లు రూ.80ని స్టాప్ లాస్ ధరగా పరిగణించాలన్నారు.

ఇక ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ టెక్నికల్ అనలిస్ట్ మెహుల్ కొఠారి ఐఆర్సీటీసీ షేర్లపై సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి రూ.795 టార్గెట్ ధరగా ప్రకటిస్తూ రూ.715ను స్టాప్ లాస్ ధరగా పరిగణించాలని పేర్కొన్నారు. అలాగే కంపెనీలోని సీనియర్ మోనేజర్ జిగర్ ఎస్ పటేల్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందిస్తూ రూ.645 టార్గెట్ ధరగా పేర్కొన్నారు. దీనికి రూ.499 స్టాప్ లాస్ ధరగా పరిగణించాలని వెల్లడించారు.
ఇక కోటక్ సెక్యూరిటీస్ కి చెందిన శ్రీకాంత్ చౌహాన్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లపై సానుకూలత వ్యక్తం చేస్తూ రూ.1,460 టార్గెట్ ధరగా పేర్కొన్నారు. దీనికి స్టాప్ లాస్ ధరను రూ.1,315గా సూచించారు. ఇదే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లకు రూ.227 టార్గెట్ ధరగా అందిస్తూ.. స్టాప్ లాస్ ధర రూ.204గా పరిగణించాలన్నారు. అలాగే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెస్స్ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.725గా పేర్కొన్నారు. దీనికి రూ.660 స్టాప్ లాస్ ధరగా సూచించారు.
చివరగా ఆషికా స్టాక్ బ్రోకింగ్ టెక్నికల్ & డెరివేటివ్ అనలిస్ట్ ఓంకార్ పాటిల్ అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీ షేర్లపై తన సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.10,400గా పేర్కొంటూ.. స్టాప్ లాస్ ధరను రూ.9,075గా సూచించారు. అలాగే NOCIL కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.290గా వెల్లడిస్తూ స్టాప్ లాస్ ధరగా రూ.250ని పరిగణించాలన్నారు.


Click it and Unblock the Notifications