భారతదేశంలో భక్తికి, నమ్మకానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. మన దేవాలయాల వద్ద ఉన్న సంపదకు కూడా అంతటి చరిత్ర ఉంది. వందల ఏళ్లుగా భక్తులు సమర్పిస్తున్న కానుకలు, విరాళాల వల్ల నేడు మన దేశంలోని కొన్ని దేవాలయాలు ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక సంస్థలుగా అవతరించాయి. 2026 నాటి అంచనాల ప్రకారం.. టన్నుల కొద్దీ బంగారం (Gold), వేల ఎకరాల భూములు, కోట్లాది రూపాయల నగదు నిల్వలతో అలరారుతున్న ఆ టాప్ 10 ఆలయాల వివరాలు ఇక్కడ చూద్దాం.
1. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కేరళ
తిరువనంతపురంలోని ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలోని రహస్య గదులు (Vaults) తెరిచినప్పుడు బయటపడిన బంగారం, వజ్రాలు, పురాతన నాణేల విలువ చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. కేవలం ఒక్క గదిలోని సంపదే సుమారు రూ. 1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇవి పురాతన వస్తువులు కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ ఇంకా ఎక్కువే ఉండవచ్చు.
2. తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్
సంపద పరంగా పద్మనాభస్వామి ఆలయం మొదటి స్థానంలో ఉన్నా.. అత్యధిక ఆదాయం వచ్చే ఆలయంగా తిరుమల నిలుస్తుంది. TTD నివేదికల ప్రకారం, ఈ ఆలయ మొత్తం ఆస్తులు రూ. 2.5 లక్షల కోట్లు దాటాయి. బ్యాంకుల్లో ఉన్న 10 టన్నుల బంగారం (Gold) డిపాజిట్లు, నగదు, భూములు ఈ ఆలయ ఐశ్వర్యానికి నిదర్శనం. ప్రతిరోజూ హుండీ ద్వారా వచ్చే ఆదాయం, లడ్డూ ప్రసాదం అమ్మకాలు ఇక్కడ ప్రధాన వనరులు.
3. షిరిడీ సాయిబాబా ఆలయం, మహారాష్ట్ర
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తుల వల్ల ఈ ఆలయ ట్రస్ట్ కు ఏటా రూ. 400 నుంచి రూ. 500 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇక్కడి సంపదను కేవలం నిల్వ చేయడమే కాకుండా, ఉచిత భోజనం, హాస్పిటల్స్ , విద్యా సంస్థల నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తారు.
4. వైష్ణో దేవి ఆలయం, జమ్ము అండ్ కాశ్మీర్
ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శించే ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ. 500 కోట్లు దాటుతుంది. భక్తులు సమర్పించే బంగారం, వెండి నాణేలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

5. స్వర్ణ దేవాలయం (Golden Temple), పంజాబ్
అమృత్‌సర్‌లోని ఈ ఆలయం సిక్కుల పవిత్ర క్షేత్రం. ఈ ఆలయ పైకప్పు సుమారు 750 నుంచి 1500 కిలోల స్వచ్ఛమైన బంగారం (Gold) తో నిర్మితమైంది. ఏటా రూ. 1,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండే ఈ ఆలయం.. రోజుకు లక్ష మందికి పైగా ఉచితంగా భోజనం పెడుతుంది.
6. సిద్ధివినాయక ఆలయం, ముంబై
ముంబైలోని గణపతి ఆలయం సెలబ్రిటీలు , బిజినెస్ దిగ్గజాలకు ఫేవరెట్. ఏటా రూ. 125 కోట్ల వరకు విరాళాలు వస్తుంటాయి. ఆలయ గర్భాలయం లోపలి భాగం మొత్తం బంగారు తాపడంతో మెరిసిపోతుంటుంది.
7. జగన్నాథ ఆలయం, ఒడిశా
పూరీలోని ఈ ఆలయానికి సుమారు 60,000 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక భూములు ఉన్న ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి 'రత్న భండార్' లో ఉన్న పురాతన బంగారు ఆభరణాల విలువ లెక్కకట్టడం ఇంకా పూర్తి కాలేదు.
8. మీనాక్షి అమ్మవారి ఆలయం, తమిళనాడు
మదురైలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు పేరుగాంచింది. ఈ ఆలయం వద్ద ఉన్న పురాతన వజ్రాల కిరీటాలు, బంగారు నగలు ఎంతో విలువైనవి. దక్షిణ భారతదేశంలో ఇది అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా కొనసాగుతోంది.
9. శబరిమల అయ్యప్ప ఆలయం, కేరళ
కేవలం మకరవిలక్కు, మండల పూజ సమయాల్లో మాత్రమే తెరిచే ఈ ఆలయం.. ఆ కొద్ది రోజుల్లోనే రూ. 300 కోట్ల ఆదాయాన్ని గడిస్తుంది. ఇక్కడ అరవణ పాయసం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ.
10. సోమనాథ్ ఆలయం, గుజరాత్
చరిత్రలో ఎన్నోసార్లు దాడులకు గురైనా.. ఈ ఆలయం తన వైభవాన్ని కోల్పోలేదు. ప్రస్తుతం ఈ ఆలయ ట్రస్ట్ కు భారీగా భూములు, నగదు నిల్వలు ఉన్నాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
ఏదేమైనా భారతదేశంలోని ఈ దేవాలయాలు కేవలం అపారమైన సంపదకు నిలయాలు మాత్రమే కాదు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలు. ఇక్కడ పోగయ్యే బంగారం నగదు విరాళాలు కేవలం ఆలయ నిర్వహణకే పరిమితం కాకుండా.. విద్య, వైద్యం, అన్నదానం వంటి అనేక సామాజిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications