టాప్ 10 అత్యంత, అతితక్కువ అవినీతి దేశాలు ఇదిగో... ఇండియా ఏ ర్యాంక్లో ఉందంటే..
దేశంలో అవినీతి పెరిగితే ఏం జరుగుతుంది ? ఫస్ట్ అవినీతి ఎక్కువైతే అది అక్కడి ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు ఇంకా ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అవినీతి అనేది లంచం, అధికార దుర్వినియోగం లేదా ఇతర రూపంలో కూడా ఉండొచ్చు. దీని వల్ల దేశ సామర్ధ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. అయితే జనవరి 2024లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఆవిష్కరించిన 2023 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడిస్తోంది. అదేంటంటే డెన్మార్క్ 2024లో అత్యంత తక్కువ అవినీతి దేశంగా ఈ లిస్టులో ముందుంది. మరోవైపు సోమాలియా దేశం అత్యంత అవినీతి దేశాలలో ఒకటిగా మిగిలిపోయింది.
ప్రపంచంలో అత్యంత అలాగే తక్కువ అవినీతి దేశాల లిస్ట్ చూస్తే 2022 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) 180 దేశాలను మూల్యాంకనం చేసింది, అందులో ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిల ఆధారంగా 0 నుండి 100 వరకు స్కోర్‌ను కేటాయించింది. ఈ లిస్టులో డెన్మార్క్, ఫిన్లాండ్ అండ్ న్యూజిలాండ్ వంటి దేశాలు అతితక్కువ అవినీతి దేశాలుగా ఉండగా, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియాలు అత్యంత అవినీతి దేశాలుగా ఉన్నాయి. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) స్కోరు 90తో డెన్మార్క్ ప్రపంచంలోనే అతితక్కువ అవినీతి దేశంగా గుర్తింపు పొందింది. డెన్మార్క్ తరువాత, ఫిన్లాండ్ CPI స్కోరు 87తో రెండవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ CPI స్కోరు 85తో తక్కువ అవినీతి దేశాల్లో స్థిరంగా ఉంది. ఈ దేశం లంచాల వ్యతిరేకత, మనీలాండరింగ్ నిరోధక చట్టాలను అమలు చేసింది.

నార్వే 84 స్కోర్‌తో అవినీతిని ఎదుర్కోవడంలో గొప్ప చట్టాలు పాటిస్తుంది. సింగపూర్ CPI స్కోర్ 83తో ఉండగా, 82 స్కోరుతో స్వీడన్, స్విట్జర్లాండ్ 82 స్కోర్ సాధించింది. వ్యాపారం, రాజకీయాలతో సహా వివిధ రంగాలలో తక్కువ అవినీతికి ఈ దేశం గుర్తింపు పొందింది. అవినీతి నిరోధక చట్టాలను అమలు చేయడంలో కూడా ఈ దేశంలోని స్వతంత్ర న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. నెదర్లాండ్స్ 79 CPI స్కోర్, జర్మనీ 78 CPI స్కోర్‌తో చివరగా లక్సెంబర్గ్ 78 స్కోర్ సాధించింది. మరోవైపు అత్యంత అవినీతి దేశాలలో సోమాలియా CPI స్కోరు 11తో ఉండగా, సోమాలియా తర్వాత వెనిజులా 13వ స్థానంలో ఉంది, ఇక్కడ ఆర్థిక దుర్వినియోగం, రాజకీయ గందరగోళం అవినీతి స్థాయిలను పెంచాయి. చివరగా సౌత్ సూడాన్ 14 CPI స్కోర్‌తో పొందింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం భారతదేశం 2023కి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI)లో 39 స్కోర్‌లను సాధించింది, మొత్తం 180 దేశాలలో 93వ స్థానంలో ఉంది.
భారత ప్రభుత్వం సంవత్సరాలుగా ఎన్నో అవినీతి వ్యతిరేక చర్యలను అమలు చేస్తుంది. ప్రపంచ సగటు CPI స్కోర్ ప్రస్తుతం 43 వద్ద ఉంది, అంటే భారతదేశ అవినీతి స్థాయి ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని సూచిస్తుంది. పాకిస్తాన్ (133వ ర్యాంక్), శ్రీలంక (115వ ర్యాంక్) వంటి పొరుగు దేశాలతో పోల్చితే భారతదేశం కాస్త ముందుంది. ఈ ర్యాంకింగ్‌లు అవినీతిని ఎదుర్కోవడంలో ట్రాన్సరెన్సి, జవాబుదారీతనం, చట్టపరమైన చర్యల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రపంచవ్యాప్తంగా అతితక్కువ, అత్యంత అవినీతి దేశాల మధ్య పాలన నాణ్యతలో స్పష్టమైన తేడాలను హైలైట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications