Ayodhya News: దేశంలోని హిందువుల 500 ఏళ్ల నిరీక్షణకు నేడు తెరపడింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో శ్రీరాముని ఆలయం అయోధ్యలో అంగరంగ వైభవంగా పూజాధికాలతో ప్రారంభమైంది. అయితే రాముని జీవితం నుంచి సగటు పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- రాముని జీవితం నుంచి ఇన్వెస్టర్లు సహనం నేర్చుకోవాలి. తండ్రి కోరిక మేరకు 14 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్లిన శ్రీరాముడు అపారమైన సహనాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలోనూ దీర్ఘకాలిక వ్యూహాలు మంచి ఫలితాలను అందిస్తాయని నేర్చుకోవాలి.

- రాముని జీవితం నుంచి నేర్చుకోవాల్సిన రెండవ అంశం రిస్క్ మేనేజ్మెంట్. సీతను అడవికి తీసుకెళ్లడం వల్ల కలిగే ప్రమాదాలు తెలిసినప్పటికీ, శ్రీ రాముడు సంభావ్య ప్రమాదాన్ని తగ్గించడానికి నివారణ చర్యలను అమలు చేశారు. పెట్టుబడిదారులు సైతం సంభావ్య నష్టాలను తగ్గించుకోవటానికి తమ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటాన్ని గ్రహించాలి.
- శ్రీరాముని జీవితం క్షమశిక్షణకు, ధర్మానికి నిలువుటద్ధం. ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడిలో క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవలంబించాలని, క్రమశిక్షణ అవసరాన్ని ఇది సూచిస్తుంది. స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక విజయానికి స్థిరత్వం కీలకమని చెబుతుంది.
- రామ్ తన బాధ్యతలను ఎప్పుడూ ప్రశ్నించకుండా, వాటిని నెరవేర్చటంలో సంకోచించకుండా ముందుకు సాగారు. పెట్టుబడిదారుడు సైతం తన పెట్టుబడులు, వాటాదారుల పట్ల తన బాధ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
- రాముడు తన వానరసేనతో రావణుడితో యుద్ధం చేసినప్పుడు.. అసాధారణమైన వ్యూహాత్మక ప్రణాళికను ప్రదర్శించారు. అత్యధిక రాబడులను పొందేందుకు పెట్టుబడిదారులు ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి వ్యూహాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని దీని నుంచి గ్రహించాలి.
- సంక్షోభ సమయంలో పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన ధైర్యాన్ని ప్రదర్శించాలనే విషయాన్ని రాముని జీవితం నుంచి పెట్టుబడిదారులు గ్రహించాలి.
- రాముని జీవితం జ్ఞానం కోసం నిరంతర అన్వేషణ. ఎప్పటికప్పుడు మారుతున్న స్టాక్ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు మారుతున్న ట్రెండ్ లను అప్ డేట్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లు జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండాలని ఇది సూచిస్తుంది.
- రాముని జీవితం నిజాయితీ, పారదర్శకతకు ప్రతిరూపం. స్టాక్ మార్కెట్‌లో వ్యవహరించేటప్పుడు ప్రతి పెట్టుబడిదారుడు పాటించాల్సిన విలువల గురించి ఇది అవగాహన కల్పిస్తుంది.
- హనుమంతుని సామర్థ్యాలను విశ్వసించడం ద్వారా రాముడు గొప్ప యుద్ధంలో విజయం సాధించారు. అలాగే ఇన్వెస్టర్లు సైతం తాము పనిచేసే జట్టును విశ్వసించాలని ఇది సూచిస్తుంది.
- రాజు అయినప్పటికీ రాముడు ఎప్పుడూ వినయంగా ఉండేవాడు. పెట్టుబడిదారులకు కూడా విజయం నుంచి అహంకారాన్ని పెంచుకోకూడదని నేర్చుకోవాలి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications