Stock Market: ఆవిరైన రూ.1.53 లక్షల సంపద.. మునిగిన రిలయన్స్, టీసీఎస్
Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలోని ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో పెద్దగా మార్కెట్ సూచీల్లో పాజిటివ్ చలనం కనిపించలేదు.
దీంతో మార్కెట్లో టాప్-10 విలువైన కంపెనీల విలువ భారీగా పతనమైంది. అవును వాటి మార్కెట్ క్యాప్ రూ.1.53 లక్షల కోట్ల మేర ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా విదేశీ మదుపరులు తమ సంపదను వెనక్కి తీసుకోవటం భయాలను రేకెత్తించింది. యుద్ధ సమయంలో బంగారం, బాండ్ మార్కెట్ల వైపు వారు ఎక్కువగా తమ పెట్టుబడులను మళ్లించినట్లు డేటా వెల్లడిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే గతవారం బీఎస్ఈ సూచీ 1.33 శాతం నష్టపోయి 885.12 పాయింట్లను కోల్పోయింది. వీటిలో ప్రధానంగా ఎక్కువ శాతం నష్టపోయిన కంపెనీలు మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ.34,876.78 కోట్లు క్షీణించగా.. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.27,827.08 కోట్ల మేర ఆవిరైంది. ఇది భారీగా మార్కెట్ విలువను కోల్పోయిన మూడో కంపెనీగా హిందుస్థాన్ యూనీలివర్ నిలిచింది. దీని విలువ రూ.18,103.6 కోట్ల మేర పతనమైంది.
బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ల పతనంతో మార్కెట్ క్యాప్ రూ.17,171.75 కోట్ల మేర పతనమైంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ రూ.13,518.4 కోట్లు, ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.12,533.27 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ రూ.11,512.75 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ.10,387.09 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ.5,139.88 కోట్లు తగ్గగా.. చివరగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.1,909.18 కోట్లు గతవారం కనుమరుగైపోయింది. దీంతో టాప్-10 కంపెనీల విలువ భారీగానే క్షీణించిందని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications