చాలా ఏళ్లుగా ఉన్న టెలికం కంపెనీలు 2జీ నెట్ వర్క్‌ను నిర్మించేందుకు 25 సంవత్సరాలు తీసుకున్నాయని, జియో మాత్రం మూడేళ్లలోనే 4జీ నెట్ వర్క్‌ని నిర్మించిందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సిద్ధంగా ఉందని చెప్పారు.
టీఎం ఫోరం ఆధ్వర్యంలోని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీలో ముఖేష్ అంబానీ మాట్లాడారు. 2016లో జియో టెలికం పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుండి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్థానంలో ఉన్న భారత్ అగ్రస్థానానికి వచ్చిందన్నారు.

జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందన్నారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్ వర్క్‌లో చేరుతున్నారన్నారు. దేశంలో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి చేరుకుందన్నారు. అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని, దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం ఉందన్నారు.
50 కోట్ల మంది కస్టమర్ల దిశగా రిలయన్స్ జియో సాగుతోందన్నారు. కనెక్టివిటీలో మరింత ముందుకు సాగే లక్ష్యంలో భాగంగా హైస్పీడ్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌ను ప్రారంభించిందన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను ప్రారంభించామని తెలిపారు. జియో యూజర్లకు వాయిస్ సేవలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. జియోకు ముందు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్ ఫోన్లతో సాధ్యం కాక ఎంతోమంది భారతీయులు డిజిటల్‌కు దూరంగా ఉన్నారన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications