Tomato: తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో టమాటా ధరలు..
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ.150 పలికిన టమాటా రూ. 196 పలుకుతోంది. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది. శనివారం కిలో నాణ్యమైన టమాటా కిలో రూ.196 పలికింది.
శనివారం మదనపల్లె కూరగాయల మార్కెట్‌కు కేవలం 253 టన్నుల టమాటా రావడంతో ధర భారీగా పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు వివరిస్తున్నారు. మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా రూ. 160 - రూ. 196 వరకు పలుకుతుండగా.. రెండవ రకం రూ.120 - రూ.156 వరకు పలుకుతోంది.

వంకాయ రూ.50, బెండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ. 140, కాకర రూ.80, బీరకాయ రూ.120, కాలీఫ్లవర్ రూ. 80, క్యాబేజీ రూ.50, క్యారేట్ రూ.80, దొండకాయ రూ.50,ఆలుగడ్డ రూ.40, గోరుచిక్కుడు రూ.60, దోసకాయ రూ.60, సోరకాయ రూ.60, చిక్కుడు రూ.80, చామగడ్డ రూ.60, పాలకూర రూ.60, చుక్కకూర రూ.60, తోటకూర రూ.60 పలుకుతోంది.ఈ టమాటా ధరలు తగ్గాలంటే.. సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు.
మరో రెండు నెలల్లో టమాటా ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతమవుతున్నారు. టమాటా ఒక్కటే కాదు.. పచ్చి మిర్చి, క్యాప్సకమ్, అల్లం ధరలు కూడా భారీగా ఉన్నాయి. అటు బియ్యం ధరలు భారీగా పెరుగుతోన్నాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయ పంటలు దెబ్బతినడంతో ధరలు పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ లో టమాటా, వంకాయ, బెండలాంటి కూరగాయలు, ఆకుకూరల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.


Click it and Unblock the Notifications