Tomato: ఆకాశానికి టొమాటో ధరలు.. సెంచరీలు కొడుతున్న కూరగాయలు..
Tomato Prices: ఇప్పటి వరకు ఎండ దెబ్బకు భయపడిన ప్రజలు తాజాగా కూరగాయల రేట్ల దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న రేట్లతో సామాన్యులు కూరగాయలు కొనాలనే ఆలోచనతోనే సతమతమౌతున్నారు.
ఒక్కోసారి రైతులు అమ్ముకున్న నష్టం వచ్చేంత దారుణమైన స్థాయికి టమాటా ధరలు పడిపోవటం మనం చూస్తునే ఉన్నాం. అయితే ప్రస్తుతం దేశంలో రుతుపవనాలు ప్రారంభమై విస్తరిస్తున్న తరుణంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత నెలలో కిలో రూ.20కి దగ్గరగా ఉన్న టమాటా ధర ప్రస్తుతం సెంచీ కొట్టింది. ఇది కిలోకు రూ.120 వరకు చేరుకోవచ్చని మార్కెట్లోని విక్రయదారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఇతర కూరగాయలైన బెండ, క్యాప్సికం, ముల్లంగి, క్యారెట్, పచ్చిమిర్చి, ఆకుకూరలు, వంకాయలు వంటి కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాల కారణంగా పంటలు నీట మునిగాయి. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రేట్లు మండిపోతున్నాయి. బెంగళూరులో సైతం టమాటా పంట నీటమునిగింది. దీనికి తోడు ఇతర మార్కెట్లకు సైతం ఉత్పత్తి తక్కువగా వస్తుండటం అధిక ధరలకు కారణమని ఆజాద్‌పూర్ సబ్జీ మండికి చెందిన కూరగాయల వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి అనిల్ మల్హోత్రా తెలిపారు.
వర్షాల కారణంగా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో టమాట, మిర్చి ధరలు విపరీతంగా పెరగడం వెనుక కారణాలు ఇవేనని చెప్తున్నారు. మనరాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటాలు ఎక్కువ ఉత్పత్తి ఉండేది. లేదంటే బెంగళూరు నుంచి దిగుమతి చేసుకోవాలి. అయితే ప్రస్తుతం కర్ణాటకలో సైతం పంట నష్టపోవటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు సామాన్యులు కొని తినలేని స్థాయికి చేరుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ధరలను పరిశీలిస్తే..
టమాటా కిలో రూ.90-రూ.100
ఉల్లి కిలో రూ.32
క్యారెట్ కిలో రూ.130
బంగాళ దుంపలు కిలో రూ.32
దొండకాయలు కిలో రూ.60
క్యాప్సికం కిలో రూ.95
కాకరకాయ కిలో రూ.60
బెండకాయలు కిలో రూ.60
వంకాయలు కిలో రూ.80-రూ.100
బీరకాయ కిలో రూ.70
పచ్చిమిర్చి కిలో రూ.120


Click it and Unblock the Notifications